ఆంధ్ర ప్రదేశ్ లో హత్యలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల పై దాడులు ఎక్కువ అవుతున్నాయి. విజయవాడలో మాత్రం ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు జరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. విజయవాడలో నర్స్ పై ఓ వ్యక్తి  ప్రేమించాలని వేధిస్తున్నాడు.. ఆమె అందుకు నిరాకరించడంతో  ఆమెను అతి దారుణంగా చంపేశారు. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. దివ్య తేజేస్వినీ హత్య కేసు సంచలనంగా మారింది..



ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.. నిందితుడు నాగేంద్ర స్వామికి , డివ్యకు ముందే పరిచయం ఉందని, అంతేకాదు వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు అమ్మాయి తల్లి దండ్రులు ఖండించారు.అయితే ఈ కేసు మాత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. దివ్య తేజస్విని హత్య కేసుకు సంబంధించి ఆమె తల్లిదండ్రులు మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్‌.. దివ్య తల్లిదండ్రులు జోసెఫ్‌, కుసుమ, దివ్య సోదరుడు దినేష్‌లను స్వయంగా సీఎం జగన్‌ వద్దకు తీసుకొచ్చారు.



తమ కూతురికి జరిగిన అన్యాయాన్ని జగన్ వద్ద చెప్పారు.కేసులో తమకు న్యాయం జరిగేలా చూడాలని సీఎం జగన్‌ను కోరారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జగన్ మోహన్ ముందుకు తీసుకొచ్చారు. తమ కూతురుకు ఎటువంటి పాపం తెలియదు అని చెప్పారు.. ముఖ్యంగా అసలు విషయం గురించి తెలియజేశారు. అతను కావాలని తమ కూతురిని చంపినట్లు వెల్లడించారు. ఈ విషయం పై కేసు విచారణ లో ఉంది. జగన్ ను కూడా వాళ్ళు న్యాయం జరిపించాలని కోరారు. ఈ విషయం పై జగన్ కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: