నెల్లూరు జిల్లాలో హెలికాప్టర్ ల్యాండింగ్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎలాంటి అనుమతులు లేకుండానే ఓ హెలికాప్టర్ ల్యాండ్ అవడంతో అధికార యంత్రాంగం ఆశ్చర్యపోయింది. ఏ ప్రాంతంలో అయినా హెలికాప్టర్ ల్యాండ్ కావాలంటే ఏవియేషన్ అనుమతితో పాటు స్థానిక పరిపాలన అధికారి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అవేవి లేకుండానే నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం రేవూరులో హెలికాప్టర్ ల్యాండ్ అయింది.

ప్రముఖ సినీ నిర్మాత, మాజీ ఏవియేషన్ అధికారి రామకోటేశ్వర రావు రేవూరులో జనార్ధన్ రెడ్డి అనే ఎన్నారై ఇంట్లో పెళ్లికి హెలికాప్టర్ లో వచ్చాడు. ఎలాంటి అనుమతి లేకుండా ల్యాండ్ చేయడంలో పోలీసులు విచారణ జరిపారు. ఈ నెల 27వ తేదీన ఎన్నారై బోవెళ్ల జనార్ధన్ రెడ్డి ఆహ్వానం మేరకు రామకోటేశ్వర రావు కుటుంబ సమేతంగా హెలికాప్టర్ లో పెళ్లికి వచ్చారు. కేవలం స్కూల్ హెడ్ మాస్టర్ ఎన్ఓసీ తీసుకుని హెలికాప్టర్ ను స్థానిక జిల్లా పరిషత్ స్కూల్ లో ల్యాండ్ చేశారు. అయితే వీరిలో ఓ మహిళ ఆరోగ్యం బాగాలేదు. అందుకే హెలికాప్టర్ లో వచ్చినట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా హెలికాప్టర్ ల్యాండ్ చేయడంతో అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: