అసలు
క్రాంతి కిరణ్ తెలుగు భాష కూడా సరిగ్గా మాట్లాడలేరు అని
బాబు మోహన్ ఎద్దేవా చేశారు. అరటి పండ్లు అమ్ముకునే వారి దగ్గర నుంచి కూడా
ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేస్తున్నారని, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా బరితెగించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని బాబుమోహన్ మండిపడ్డారు. అలాగే పటాన్ చెరువు
ఎమ్మెల్యే మహిపాల్
రెడ్డి వ్యవహారం పైన
బాబు మోహన్ స్పందించారు.
ఎమ్మెల్యే మాట్లాడిన మాటలే టిఆర్ఎస్
ఎమ్మెల్యే ల పరిస్థితిని తెలియజేస్తోందని అన్నారు.
భూకబ్జాలు చేసిన వారిని ప్రశ్నిస్తే అసలు తప్పు ఏంటి అంటే ఆయన ప్రశ్నించారు. అసలు
ఎమ్మెల్యే లు ఇలా తయారు కావడానికి కారణం
కేసీఆర్ ఇచ్చిన శిక్షణ అంటూ
బాబు మోహన్ ఆరోపించారు. ఇదిలా ఉంటే
బాబు మోహన్ టిఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరిన దగ్గర నుంచి కాస్త సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. ఇటీవల తెలంగాణలో
బిజెపి బలం నిరూపించుకున్న తరుణంలో
బాబు మోహన్ కాస్త యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు గా కనిపిస్తున్నారు.