అయితే 2019 ఎన్నికల నుంచి కృష్ణా కాస్త వైసీపీకి అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. పైగా జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మరింత అడ్వాంటేజ్ అవుతున్నాయి. ఇక రాజకీయంగా ఇక్కడ వైసీపీలో బాగా బలమైన నేతలు కూడా తయారవుతున్నారు. ఇప్పటివరకు ఇక్కడ టీడీపీ డామినేషన్ ఉండేది కాబట్టి, ఆ పార్టీలో దేవినేని ఉమా, కేశినేని నాని, గద్దె రామ్మోహన్, బొండా ఉమా, కొనకళ్ళ నారాయణ, ఇంకా పలువురు బలమైన నేతల హవా ఉండేది.
కానీ ఇప్పుడు వైసీపీ డామినేషన్ ఉంది. అయితే ఆ పార్టీలో బాగా బలమైన నాయకుడు అంటే కొడాలి నానినే అని చెప్పొచ్చు. కృష్ణా జిల్లా వైసీపీ పేరు చెప్పగానే మొదట కొడాలి పేరునే గుర్తొస్తుంది. టీడీపీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, వైసీపీలో సైతం రెండుసార్లు గెలిచి, జగన్ కేబినెట్‌లో మంత్రిగా కీలకంగా పనిచేస్తున్న కొడాలికి జిల్లా వ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది. జిల్లాలో బాగా ఫాలోయింగ్ ఉన్న నాయకుడు కూడా కొడాలినే.
ఇక కొడాలి తర్వాత మరో మంత్రి పేర్ని నానికి సైతం మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకంటూ సెపరేట్ క్రేజ్ ఉంది. ఇక జిల్లాలో గుర్తింపు ఉన్న నాయకుల్లో వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, పార్థసారథి, సామినేని ఉదయభానులు ఉన్నారు. అయితే జిల్లాలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలు పెద్దగా హైలైట్ అయిన సందర్భాలు లేవు. ఏదేమైనా కృష్ణాలో కొడాలి నానిదే లీడింగ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి