దీంతో సేవింగ్స్ అకౌంట్ కలిగిన కష్టమర్లందరికీ కూడా ఎక్కువ వడ్డీ లభించనునట్లు తెలుస్తోంది. వడ్డీరేట్ల పెంపు నిర్ణయం జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం ఈ సేవింగ్స్ అకౌంట్ లో లక్షరూపాయల వరకు బాలన్స్ ఉంటే ఇకపై వారికి 7 శాతం వరకు వడ్డీ రేట్ లభిస్తుందని బ్యాంకు శుభ వార్త చెప్పింది. అయితే ఇప్పటి వరకు ఈ బ్యాలెన్స్ కలిగిన అకౌంట్ పై కేవలం ఆరు శాతం మాత్రమే వడ్డీ రేటు అందించేది ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్. అయితే ఇతర బ్యాంకులు అందించే వడ్డీ రేట్లతో పోలిస్తే ప్రస్తుతం ఈ బ్యాంకు అందిస్తున్న వడ్డీ రేటు రెట్టింపు అని చెప్పాలి.
ఇటీవల సేవింగ్ అకౌంట్ లో వడ్డీ రేట్లను పెంచుతూ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకోవడంతో కస్టమర్ల పై ఎంతగానో సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అటు బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో కస్టమర్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఒకవేళ మీరు కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలని భావిస్తే ఆన్లైన్లోనే అకౌంట్ తెరిచేందుకు అవకాశం ఉంటుంది.. దీనికోసం మీరు https://www.idfcfirstbank.com ఈ లింక్ ఓపెన్ చేసి అకౌంట్ తెరిచేందుకు అవకాశం ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి