కర్ణాటక రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. గతంలో తాత్కాలికంగా అధికారాన్ని పొందిన కుమారస్వామి పార్టీ, తరువాత బీజేపీ ఆడిన రాజకీయ చదరంగంలో నిలవలేక అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు జేడీఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కుమార స్వామి సందర్భం దొరికితే చాలు బిజెపి పై మండిపడుతున్నారు. వీలు దొరికితే చాలు కర్ణాటకలో అధికార పార్టీపై విమర్శల బాణాలు విసురుతున్నారు. గతంలో తమ పార్టీని అధిష్టానం నుండి కూలదోసిన బీజేపీకి చెమటలు పట్టిస్తూ ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. కష్టం వచ్చినప్పుడు ఆదుకోలేని ప్రభుత్వం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు.. కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వం... చూసీ చూడనట్లు వ్యవహరించింది అంటూ దుమ్మెత్తిపోశారు కుమారస్వామి.

అప్పట్లో వరదల సమయంలో ప్రజల కన్నీరు తుడవకుండా కర్ణాటక సర్కారు ప్రజల్ని గాలికి వదిలేసింది అంటూ విమర్శల వర్షం కురిపించి ప్రభుత్వ వైఖరిని ఎత్తిచూపారు కుమారస్వామి. ఇలా ప్రతిసారి సమస్యల్లో ఉన్న పేద ప్రజలను పట్టించుకోని పార్టీకి అధికారం దండగ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కుమారస్వామి. ఇప్పుడేమో ఏకంగా మాతృభాషకు ఎసరు పెట్టేలా కసరత్తు చేస్తోంది ప్రభుత్వం అంటూ కర్ణాటక అధిష్టానాన్ని ఏకి పారేశారు కుమార్ స్వామి. మన సంస్కృతిని, సాంప్రదాయాలను మరియు భాషను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఖచ్చితంగా ఉంటుందని అలాంటిది ఆ విషయాన్ని విస్మరించి పర భాష కు ప్రాధాన్యం ఇవ్వడం కోసం పాకులాడడం లో అర్థం లేదన్నారు.

కుమారస్వామి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ విమర్శలన్నీ విన్న కొందరు ప్రజలు కుమారస్వామికి మద్దతు పలుకుతున్నారు. ఈ రకంగా చూస్తే అధికార పార్టీ ని టార్గెట్ చేసిన కుమారస్వామికి కాలం కలిసి వచ్చేలా కనిపిస్తోంది. సీఎం యడియూరప్పకు కుమారస్వామి కుంపటి బాగానే పెడుతున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మరి ఇది ఇంకెంత దూరం వెళ్లనుందో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: