పోలవరం.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రా ప్రాంతానికి ఊరటనిచ్చేలా కేంద్రం ప్రకటించిన వరం. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి.. విభజన తాలూకూ నష్టం కాస్తయినా పూడ్చాలని ఆనాటి యూపీఏ సర్కారు తలచింది. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంది. దాన్ని మోడీ సర్కారు కూడా కొనసాగిస్తూ వచ్చింది. అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది.
పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలిపేయడం కూడా సాహసోపేత నిర్ణయమే.. మొదట్లో ఈ అంశంపై తెలంగాణ సీఎం కాస్త హడావిడి చేసినా.. ఆ తర్వాత లైట్ గా తీసుకున్నారు. కేంద్రమే నిర్ణయం తీసుకుంటే మనమేం చేయగలం.. అది ముగిసిన అధ్యాయమని ఆయనే తేల్చి చెప్పేశారు. ఇక పోలవరం ఇష్యూపై ఎలాంటి గొడవా ఉండదనే అంతా అనుకున్నారు. ఆంధ్రా సర్కారు కూడా నాలుగేళ్లలో పోలవరం కట్టేయాలంటూ వేగంగా చర్యలు తీసుకుంటోంది.
ఈ నేపథ్యంలో కేసీఆర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసిన సమయంలో పోలవరం విషయాన్ని ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టుపై తమకు పెద్దగా అభ్యంతరాలు లేవంటూనే.. ఆ ప్రాజెక్టు డిజైన్ మార్చాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు కడుతున్న ప్రాంతం భూకంప పరిధిలో ఉందని.. అక్కడ కాకుండా వేరే చోట కడితే.. మంచిదని తెలిపారు.. ప్రాజెక్టు డిజైన్ మార్చితే.. లక్షల మంది గిరిజనులకు ఊరటకలుగుతుందని వివరించారు. మరి కేసీఆర్ మాటలు ఉమాభారతి వింటారా..?
మరింత సమాచారం తెలుసుకోండి: