ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతటి చరిత్ర ఉందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశ నలు మూలల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఏడు కొండలపై వెలసిన వెంకటేశ్వరుడి దర్శించుకుని..  మొక్కులు తీర్చుకుంటుంటారు కోరిన కోరికలు తీర్చే బంగారు దేవుడిగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యంతో ఎంతో మంది భక్తులు పునీతులు అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కాలం తో సంబంధం లేకుండా ఎప్పుడు భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది.




 ఇక బ్రహ్మోత్సవాలలో అయితే ఇసుక వేసిన రాలనంత మంది భక్తులు అక్కడికి చేరుకొని శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటూ ఉంటారు.  ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ కారణంగా భక్తులకు దేవుడికి మధ్య చాలా దూరం పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేవలంకొంతమంది భక్తులకు మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారు.  ఇక పరిస్థితులకు అనుగుణంగా భక్తుల దర్శన సంఖ్య పెంచుతు  టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ బోర్డు శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది




 సర్వ దర్శనం టోకెన్లను 10వేల నుంచి 20 వేలకు పెంచుతున్నట్లు ఇటీవలే టీటీడీ బోర్డు ప్రకటించింది. ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలి అనే ఉద్దేశంతోనే ఇలా సర్వ దర్శనం టోకెన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాము అంటూ తెలిపింది టీటీడీ బోర్డు. తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే విష్ణు నివాసంతో పాటు.. ఇక భూదేవి కాంప్లెక్స్ లో కూడా ఈ సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంచుతున్నట్లు  తెలుస్తోంది. ఇక సర్వ దర్శనం టోకెన్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో  హర్షం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.

మరింత సమాచారం తెలుసుకోండి: