అటు కరోనా వ్యాప్తి కూడా పూర్తిగా లేదని చెప్పలేని పరిస్థితి. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగానే జరుగుతోంది.. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే విడుదల చేసిన రీషెడ్యూల్ ప్రకారం.. తొలి దశ పోలింగ్ కోసం ఈ శుక్రవారం నుండి సభ్యులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంది. అయితే జగన్ సర్కారు ఆలోచనా విధానం ప్రకారం...ఎన్నికలకు వెళ్లకుండా ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకునే పంచాయతీలకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. దాని ప్రభావం ఎంతమేర ఉంటుందనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఈ విషయంపై మాట్లాడిన సోము వీర్రాజు మరియు నాదెండ్ల మనోహర్... జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
రాష్ట్రంలో పంచాయతీలను ఏకగ్రీవంగా దక్కించుకోవడానికి జగన్ ప్రభుత్వం కొత్త కుట్ర చేస్తోందన్నారు. గత మార్చిలో జరిగినట్లు చేయడానికి ఏమాత్రం తగదని...అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిందని ఈ సందర్భంగా సోము వీర్రాజు హెచ్చరించారు. ఈ సారైనా జగనోరు సానుకూలంగా ఉండి ఎన్నికలను సజావుగా సాగేలా ఎన్నికల అధికారికి సహకరిస్తే అంతా బాగుంటుందని హితవు పలికారు. ఇదంతా చూస్తుంటే ఓవైపు టీడీపీ, ఇప్పుడు బీజేపీ మరియు జనసేనలు కూడా వైసీపీపై పకడ్బందీగా ఎన్నికలకు వెళ్తున్నసమయంలో జగనోరికి ఓటమి తప్పదని అంతా అనుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి