ఈ మధ్యకాలంలో కేటుగాళ్ల బెడద రోజురోజుకు ఎక్కువవుతోంది అన్న విషయం తెలిసిందే.  ఎంతో గౌరవంగా ఉద్యోగము వ్యాపారము చేసుకుని వచ్చిన డబ్బులతో బతకడానికి ఇష్టపడటం లేదు ఎవరూ.. ఏదో ఒక విధంగా ప్రజలను బురిడీ కొట్టించి.. భారీగా డబ్బులు దండుకుని జల్సాలు చేయడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని అయోమయ స్థితిలో పడిపోతున్నారు అనే విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో అయితే సోషల్ మీడియా మోసాలు ఎంతలా పెరిగిపోయాయో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ముందు మంచి వారిలా  పరిచయాలు పెంచుకోవడంతో ఇక ఆ తర్వాత సమయం చూసి బ్లాక్ మెయిల్  లాంటివి చేస్తున్నారు.



 అంతేకాదు ఈ మధ్యకాలంలో ఎంతోమంది ఉన్నతాధికారుల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి ఇక వారి ఖాతాల  నుంచి డబ్బులు పంపించాలి అంటూ మెసేజ్లు పంపించడం వచ్చిన డబ్బులతో జల్సాలు  చేయడం లాంటివి కూడా చేస్తున్నారు.  ఈ క్రమంలోనే రోజురోజుకు కేటుగాళ్ల పెడతా ఎక్కువవుతోంది. ఇక్కడ ఓ కిలాడి లేడి ఇలాంటి పని చేసింది. ఏకంగా పెళ్లి పేరుతో 11 కోట్ల వరకు వసూలు చేసింది ఇక ఆ తర్వాత కొన్ని రోజుల వరకు పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరిగింది.



 చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలైన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.  శృతి సిన్హా  అనే యువతి ఐపీఎస్ ఆఫీసర్గా వీరారెడ్డి అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. తాను  ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని తన చెల్లిని మీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అంటూ నమ్మబలికింది. అలా వీరా రెడ్డి అనే వ్యక్తి నుంచి 11 కోట్ల వరకు వసూలు చేసింది.  ఇక అలా వసూలు చేసిన డబ్బుతో జల్సాలు చేసుకుంటూ తిరిగింది. అయితే విషయం తెలుసుకున్న వీరారెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి కటకటాల వెనుకకు తోశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: