ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నది అన్నది ఎంత నిజమో  స్మార్ట్ ఫోన్ వాడుతున్న  ప్రతి ఒక్కరు సోషల్  మీడియాను వాడేస్తున్నారు అన్నది కూడా అంతే నిజం. ప్రస్తుతం ఎంతోమంది సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. అవసరం లేకపోయినప్పటికీ గంటల తరబడి సోషల్ మీడియాను వాడుతూ ఉన్నారు ఎంతోమంది. అయితే సోషల్ మీడియా ద్వారా కొన్ని మంచి పనులు జరుగుతూ ఉంటే మరికొన్ని చెడు పనులు జరుగుతాయి.



 ఇప్పుడు వరకు సోషల్ మీడియా కు బానిస గా మారిపోయి..  సోషల్ మీడియాను ఎక్కువగా వాడటం.. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా దొంగతనాలు ఎలా చేయాలి లేదా నేరాలు ఎలా చేయాలి అనే విషయాలను నేర్చుకోవడం లాంటి ఘటనలు ఎన్నో చూసాము. ఇలా సోషల్ మీడియా ఎన్నో దారుణాలకు కారణం అయింది. అయితే కేవలం సోషల్ మీడియా కారణంగా చెడు పనులె కాదు మంచి పనులు కూడా జరుగుతాయి అన్నది ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. సోషల్ మీడియా ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడింది.



 సోషల్ మీడియా ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడటం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా. అసలేం జరిగిందంటే.. అనంతపురం జిల్లాకు చెందిన సతీష్ అనే వ్యక్తి ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నాడు ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇక తాను చనిపోవడానికి గల కారణాలు చెబుతూ ఒక సెల్ఫీ వీడియో కూడా తీసి స్నేహితులకు సోషల్ మీడియాలో  పంపించాడు. వెంటనే అప్రమత్తమైన వారు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు అతన్ని ఎలాంటి ప్రమాదం లేకుండా నే రక్షించారు. అయితే అతడు ఎక్కడ ఉన్నాడు అనేది ఫేస్బుక్ పోస్టులో ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ఇక అతనిని కాపాడారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: