అయితే ప్రతి విషయంలో కూడా జగన్ తీరును తప్పుబడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ప్రతిపక్ష పార్టీలు కూడా లేవనెత్నీ అంశాలు ఇప్పుడు రఘురామకృష్ణంరాజు తెరమీదికి తెచ్చేవారు. అయితే సీఎం జగన్ కు వచ్చిన బెయిల్ ను వెంటనే రద్దు చేయాలి అంటూ ఇటీవల రఘు రామ కృష్ణం రాజు కోర్టులో పిటిషన్ వేయడం ఎంతో సంచలనంగా మారిపోయింది. అయితే రఘురామ కృష్ణంరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ వేయడంతో అధికార పార్టీ నేతలు అందరూ కూడా రఘురామకృష్ణంరాజు పై విమర్శలతో విరుచుకుపడ్డారు. అయితే తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందించిన రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ప్రధాని మోడీ కి లేఖ రాయడం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. తనకు వై కేటగిరీ భద్రతను ఢిల్లీలో కూడా కొనసాగించాలి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. జగన్ బెయిల్ పిటిషన్ వెంటనే రద్దు చేయాలి అంటూ పిటిషన్ వేసినప్పుడు నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పుకొచ్చాడు ఆయన. అయితే సీఎం జగన్ క్రిమినల్ ట్రాక్ రికార్డు దృష్టిలో పెట్టుకొని తనకు భద్రతను పెంచాలంటూ ప్రధాని మోడీ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. తనను చంపేందుకు కడప ప్రొఫెషనల్ కిల్లర్ తో జగన్ ఒప్పందం కుదుర్చుకున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి