గత ఏడాది ఇదే సమయంలో శర వేగంగా విజృంభించి విలయతాండవం చేసి మరణమృదంగం మోగించిన కరోనా వైరస్.. కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించింది. కానీ మళ్లీ ఈ ఏడాది అదే సమయంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం దేశంలో రెండవ రకం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈసారి వైరస్ రాకుండా రెట్టింపు  వ్యాప్తి చెందుతుంది. దీంతో ప్రతి రోజు దేశంలో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రోజురోజుకు దేశంలో పరిస్థితులు చేయి దాటి అయిపోతున్నాయేమో అన్నట్లుగా కనిపిస్తుంది.


 అయితే కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పటికే వైరస్ విషయంలో పూర్తి స్థాయి అవగాహన ఉన్న ప్రజానీకం ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు. అంతేకాదు ఏం చేస్తే ఎక్కడ కరోనా వైరస్ సోకుతుందో అని  అంతర్మథనానికి లోను అవుతూనే ఉన్నారు ఎంతోమంది.  ఈ క్రమంలోనే ఎప్పుడు కరోనా వైరస్ ఆలోచనలతోనే బతికేస్తున్నారు.  ముఖ్యంగా ఆహారం ద్వారా కరోనా వైరస్ సోకుతుందా లేదా అనే దానిపై ఇప్పటికే ఎంతోమంది లో ఎన్నో అపోహలు ఎన్నో అనుమానాలు కూడా వున్నాయి. శాస్త్రవేత్తలు ఈ విషయంపై పలుమార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇప్పటికే కొందరిలో అపోహలు మాత్రం పోలేదు.



 చాలామంది ఆహారం ద్వారా కూడా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంది అని భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఆహారం ద్వారా కరోనా వైరస్ ఎక్కడ సోక లేదని ఇక దీనికి సంబంధించి ఆధారాలు కూడా లేవు అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఆహార పదార్థాల ద్వారా మనిషి శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశించింది అనడానికి కూడా ఇప్పటివరకు ఆధారాలు లేవు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధకులు  చెబుతున్నారు. కానీ ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తినేముందు ఆహారాన్ని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు.

మరింత సమాచారం తెలుసుకోండి: