ఇంత కలకలం ఎందుకంటే.. దీనికి ఓ వీడియో సాక్ష్యం బయటపడింది. అంతే కాదు.. దాన్ని అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ కూడా ధ్రువీకరించింది. ఈ వీడియోలో ఏముందంటే.. అమెరికాకు చెందిన ఒక యుద్ధనౌకను కొన్ని యూఎఫ్‌వోలు చుట్టుముట్టాయి. ఇందుకు సంబంధించిన రాడార్ తెర దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఇందులో 9 వస్తువులు నౌకకు దగ్గరగా రావడం కనిపించింది. ఇన్వెస్టిగేటివ్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ జెరీమీ కార్బెల్ ఈ వీడియోను తాజాగా విడుదల చేశారు.
అయితే ఈ వీడియో ఇప్పటిది కాదండోయ్... ఈ ఘటన కాలిఫోర్నియాలోని శాన్ డియెగో తీరానికి చేరువలో 2019 జులైలో జరిగిందట. యూఎస్‌ఎస్ ఒమాహా అనే యుద్ధనౌకను 9 యూఎఫ్‌వోలు చుట్టుముట్టాయని డైరెక్టర్ కార్బెల్ చెప్పారు. ఆయన విడుదల చేసిన రాడార్ చిత్రాల్లోనూ అవి కనిపించాయి. ఈ ఫ్లయింగ్ సాసర్లు... గంటకు 70 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయట. షాకింగ్ విషయం ఏంటంటే... ఒమాహా యుద్ధనౌక వేగంతో పోలిస్తే ఇది దాదాపు 3రెట్లు ఎక్కువ.
ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. కొద్దిసేపు రాడార్ తెరపై కనిపించిన తర్వాత అవి అదృశ్యమయ్యాయి. అంటే.. రాడార్ పరిధికి కూడా అందకుండా అవి వెళ్లిపోయాయన్నమాట. బహుశా అవి.. ఆకాశంలో చాలా ఎత్తుకు గానీ సముద్రంలోకి గానీ అవి చేరి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంతకీ ఈ వీడియో ఎలా తీశారంటే.. నౌకలోని కమాండ్ కేంద్రం నుంచి ఈ వీడియోను చిత్రీకరించారట. ఇన్వెస్టిగేటివ్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ జెరీమీ కార్బెల్ మొన్న 15న కూడా యూఎఫ్‌వోలకు సంబంధించిన ఒక వీడియో విడుదల చేశారు. అందులోనూ ఒక గోళాకార యూఎఫ్‌వో కనిపించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి