జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగింది.  అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మాత్రమే కాకుండా ఇవ్వని హామీలను సైతం నెరవేర్చారు సీఎం జగన్.  అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరే విధంగా జగన్ పథకాలు ప్రవేశపెట్టారు అన్నది తెలిసిందే.  ఈ క్రమంలోనే అటు డ్రైవర్ల అందరికీ కూడా ఎంతో ప్రయోజనం చేకూరాలి అనే ఉద్దేశంతో.. ఎక్కడ ఆర్థిక ఇబ్బందులతో బాధపడకూడదు అని భావించి ఇక ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు వాహనమిత్ర అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం.


 ఈ పథకంలో భాగంగా అర్హులైన వారందరికీ కూడా ప్రతి ఏటా పది వేల రూపాయల ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.  అయితే ఇక వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు నిన్నటివరకు మాత్రమే చివరి తేదీ ఉంది. కానీ నిన్న సర్వర్లో ప్రాబ్లం ఉన్న కారణంగా ఈ గడువును పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహనమిత్ర పథకానికి ఇప్పటికే ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నారు. ఆటో,రిక్షా, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు ఈ పథకానికి అర్హులుగా అటు ప్రభుత్వం నిర్ణయించింది.


సాధారణంగా సంగీతదర్శకులకు ఒక ఫుల్ లెంత్ మ్యూజికల్ ఫిల్మ్ తీయాలని బాగా కోరిక గా ఉంటుంది. ఈ మ్యూజికల్ ఫిల్మ్స్ తో తమ సంగీత ప్రతిభను ప్రేక్షకులకు తెలియజేయాలని మ్యూజిక్ డైరెక్టర్స్ అనుకుంటారు. అంతేకాకుండా తమ మ్యూజిక్ తో ఒక సినిమాని కళాఖండంగా మార్చాలి అనుకుంటారు. అందరికీ మ్యూజిక్ ఫిలిమ్స్ తీసే అవకాశాలు రావచ్చు, రాకపోవచ్చు. కానీ దేవిశ్రీ ప్రసాద్ కి ఇద్దరమ్మాయిలతో సినిమాతో తన మ్యూజిక్ టాలెంట్ నిరూపించే అవకాశం వచ్చింది. ఈ సినిమాతో తనకు ఓ మ్యూజిక్ ఫిల్మ్ చేయాలనే కోరిక కూడా తీరిపోయింది.


ఇద్దరమ్మాయిలతో సినిమాలో హీరో ఒక గిటారిస్ట్. హీరోయిన్ కోమలి శంకరాభరణం (అమలాపాల్) సాంప్రదాయ సంగీతం నేర్చుకుంటూ ఉంటుంది. వయోలిన్ కూడా నేర్చుకోవాలని ఈమె బ్రహ్మానందం వద్ద విద్యార్థినిగా చేరుతుంది. ప్రధాన పాత్రలన్నీ కూడా సంగీత రంగం లోనే మునిగి తేలుతుంటే దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించి.. మ్యూజిక్ పరంగా సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రంలోని రన్ రన్ పాటను ప్రముఖ బ్రిటిష్ సింగర్ అపాచే ఇండియన్ చేత పాడించారు.



Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: