ఈ మధ్యకాలంలో తుపాకుల కలకలం ఎక్కువగా అయిపోయింది. చిన్న చిన్న పార్టీలు, పెళ్లిలలో తుపాకులు గాలిలో పేల్చడం వంటి వార్తల గురించి చూస్తూనే ఉన్నాము.ఇక చిన్నపాటి గొడవలకే తుపాకీతో కాల్చడం ఈ మధ్యన ఫ్యాషన్‌ అయిపొయింది. ఇక తాజాగా బ్యాంకుకు వచ్చిన కస్టమర్‌ మాస్క్‌ ధరించలేదని తుపాకీతో కాల్చిపారేశాడు సెక్యూర్టీ గార్డు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రైల్వే ఉద్యోగిగా పనిచేస్తు‍న్ రాజేశ్‌ కుమార్‌ తన భార్యతో కలిసి శుక్రవారం పని నిమిత్తం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు వెళ్లారు. ఈ తరుణంలో బ్యాంకకు ఎంటరవుతున్న సమయంలో రాజేశ్‌ ఫేస్‌ మాస్క్‌ పెట్టుకోకపోవడంతో సెక్యూరిటీ గార్డ్‌ వారిని అడ్డగించాడు. ఇక మాస్క్‌ పెట్టుకుంటేనే లోనికి అనుమతి ఇస్తానని సెక్యురిటీ గార్డు అన్నారు. అయితే రాజేశ్‌, సెక్యూరిటీ గార్డ్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.



ఇక సహనం కోల్పోయిన సెక్యూరిటీ గార్డ్‌ తనవద్ద ఉన్న తుపాకీతో రాజేశ్‌ తొడపై కాల్చారు. అయితే తీవ్ర రక్తస్రావంతో రాజేశ్‌ అలాగే కిందపడిపోగా.. పక్కనే ఉన్న అతని భార్య..'' నా భర్తను ఎందుకు కాల్చావు'' అంటూ పెద్దగా అరిచింది. ఇక ఇది విన్న మిగతావారు అక్కడికి వచ్చి ఇంత చిన్న విషయానికి తుపాకీతో కాలుస్తావా.. నువ్వు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అని గార్డ్‌ను ఆదేశించారు. ఈ  ఘటనను 27 సెకెన్ల నడివి ఉన్న ఫుటేజీ సీసీటీవీలో రికార్డు చేశారు.

అధికారుల నుండి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. అనంతరం గార్డ్‌ను అదుపులోకి . '' రాజేశ్‌ మాస్క్‌ ధరించలేదని.. ఆ విషయం చెప్పానని.. కానీ అతను నోటి దురుసుతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించాడని.. నన్ను బూతులు తిట్టాడు.. దీంతో తుపాకీ చూపించి బెదిరిద్దాం అనుకున్నా.. కానీ తుపాకీ మిస్‌ఫైర్‌ అయి అతనికి తగిలిందని గార్డు వాపోయాడు. ఇక ఇది అనుకోకుండా జరిగింది''. అని సెక్యూరిటీ గార్డ్‌ పోలీసులకు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: