పదవి కోసమే ఎల్.రమణ టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. అయితే తాజాగా దీనిపై స్పందించిన రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీపై టిఆర్ఎస్ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తో జరిగిన సమావేశంలో హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి చర్చ జరగలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి కోసమే టీఆర్ఎస్ లో చేరబోతున్నాను అంటూ కొన్ని పార్టీలు తనపై తప్పుడు ప్రచారాలు చేయడం హాస్యాస్పదం అన్నారు ఎల్.రమణ.
పదవులు తనకు కొత్త కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పని చేశా అంటూ రమణ తెలిపారు. ఏ పార్టీలోనైనా కష్టపడి పని చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయి అంటూ ఎల్.రమణ వ్యాఖ్యానించారు. కొన్ని సంవత్సరాల క్రితమే కెసిఆర్ టిఆర్ఎస్ లోకి రావాలని తనను ఆహ్వానించారని.. అయితే ప్రజలకు మరింత సేవ చేయడం కోసమే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో కి వెళ్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. కెసిఆర్ నాయకత్వంలో బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలు అందజేయడమే తమ లక్ష్యం అన్నారు. ఇక మరో రెండు మూడు రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్ళ పోతున్నాను అంటూ ఎల్.రమణ ప్రకటించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి