కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో బీజేపీ నుండి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు కూడా వీరికి ప్లస్ అవుతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రెండు రాష్ట్రాల్లో బలమైన నాయకుల మధ్యన ఉన్న అభిప్రాయ బేధాల కారణంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి వచ్చే అవకాశము ఉంది. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ కు మరియు ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ద రామయ్యకు మధ్యన వివాదాలు నెలకొనడంతో జాతీయ కాంగ్రెస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ వీరిద్దరినీ గట్టిగానే మందలించిన విషయం తెలిసిందే.
ఇదే రీతిలో పంజాబ్ లో కూడా జరుగుతోంది అక్కడ ఇటీవల నూతన పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయిన నవజ్యోత్ సింగ్ సిద్దు కు మరియు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కు మధ్యన వివాదాలు మొదటి నుండి ఉన్నాయి. కానీ పీసీసీ అధ్యక్ష నియామకంలో అధిష్టానం తన మాట ఖాతరు చేయలేదని కినుక వహించాడు. ఇలా రాష్ట్రానికి రెండు కళ్లుగా వ్యవవహరించాల్సిన ఇద్దరూ ఇలా కయ్యం నెయ్యం అంటుంటే, రానున్న ఎన్నికల్లో ఇదే ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు. అందుకే వెంటనే కాంగ్రెస్ అధిష్టానం వీరిద్దరి మధ్యన సయోధ్య కుదిర్చేందుకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది.

 ఇటీవలే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఎలాగైనా తన వ్యూహాలతో కాంగ్రెస్ కి మళ్ళీ కేంద్రంలో పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా అడుగులు వేయనున్నట్లు సమాచారం. అంతకు ముందు కర్ణాటక మరియు పంజాబ్ రాష్ట్రాల్లో నెలకొన్న అనిశ్చితిని మర్చి మళ్ళీ వీరంతా కలిసి పనిచేసేలా చేయనున్నారు. పీకే రాకతో సోనియమ్మ ఇంకా దైర్యంగా ఉండగలదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: