రోజురోజుకు టెక్నోలజీ పెరిగిపోతుంది. ఇక టెక్నాలజీలో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు ఏకంగా మానవ జీవన శైలినే మార్చేందుకు సిద్ధమవుతున్నాయి. మొదట నడిచి వెళ్ళడం కంటే ఏదైనా వాహనం ఉంటే బాగుండు అనుకున్న మనిషి ఆలోచన సైకిల్ తయారు కావడానికి కారణమైంది. ఇక ఆ తర్వాత సైకిల్ తొక్కడం కంటే హాయిగా కూర్చుని వెళ్ళాలి అనే ఆలోచన బైక్ తయారు కావడానికి కారణమయింది..  ఇక ఆ తర్వాత కారు ఆ తర్వాత విమానం ఇలా మనిషి మెదడులో మెదిలిన ఆలోచన వినూత్నమైన ఆవిష్కరణలకు కారణం అయింది. ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరూ కార్లు వాడుతున్నారు.  సౌకర్యవంతమైన ప్రయాణాలను పొందుతున్నారు.



 ఇలాంటి సమయంలో రోడ్లపై ట్రాఫిక్ ఉంటుంది. ఇదే కార్లు గాలిలో ఎగురుతే ఎంత బాగుంటుంది అనే ఆలోచన కూడా మనిషికి వచ్చేసింది. దీంతో గాల్లో ఎగిరే కార్లు తయారు చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం ఎన్నో కార్ల తయారీ కంపెనీలు ప్రయోగాలు కూడా మొదలు పెట్టాయ్. ఇప్పటికే వివిధ దేశాలలో గాల్లో ఎగిరే కార్లను కూడా తయారుచేసి వాటికి సంబంధించిన డెమో లను కూడా విడుదల చేశారు. ఇక వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు భారత్లో కూడా ఎగిరే కార్లు రాబోతున్నట్లు తెలుస్తుంది. భారత్లో కూడా గాల్లో ఎగిరే కార్లను తయారు చేసేందుకు అంతా సిద్ధం అవుతున్నట్లు ప్రస్తుతం తెలుస్తోంది.



 మేడిన్ ఇండియా లో భాగంగా భారత్లో కూడా ఎగిరే కార్లు తయారు చేయడానికి ఒక కంపెనీ ముందుకు వచ్చిందట. ఈ క్రమంలోనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కి దీనికి సంబంధించిన డెమో కూడా చూపించి చర్చించినట్లు తెలుస్తోంది. ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా హైబ్రిడ్ ఫ్లయింగ్ కార్ కాన్సెప్ట్ ని ఈ కంపెనీ చూపించిందట. ఈ క్రమంలోనే ఈ కాన్సెప్టుతో అటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: