ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం పైకి ఏమీ చెప్పకపోయినా.. లోపాయికారీగా.. త మవారికి బంద్‌కు సహకరించాలని సూచించింది. అయితే.. ఏపీ విషయానికి వస్తే.. ఏపీ ప్రభుత్వం కొన్నాళ్లుగా బీజేపీతో తెరచా టు సంబంధాలు సాగిస్తోందనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు.. ప్రధాని మోడీ తీసుకుంటున్న నిర్ణయాలకు జగన్ ఓకే చెబుతున్నారని కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఇలాంటి చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టేలా.. జగన్ తాజా బంద్‌కు తాము కూడా చేతులు కలుపుతున్నట్టు ప్రకటించారు.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. అయితే ఈ పరిణామమే సోమును కలవరానికి గురి చేసింది.
ఎందుకంటే.. బీజేపీతో తెరచాటున జగన్ సంబంధాలు కొనసాగిస్తూనే ఇలా మోడీ సర్కారుపై యుద్ధం ప్రకటించడాన్ని సోము జీర్జించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన కొన్ని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కప్పి పుచ్చేందుకే జగన్.. బారత్ బంద్‌కు మద్దతు ప్రకటించారని అన్నారు. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యేకంగా జరుగుతున్న పరిణామాలు అంటూ.. ఏవీ లేవు. ఏదైనా ఉంటే.. డ్రగ్స్ కేసు నడుస్తోంది. అలా అనుకుంటే.. అసలు డ్రగ్స్‌ను పట్టుకున్నదే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో..!
సో..దీనికి జగన్ తీసుకున్న నిర్ణయానికి సంబంధం లేదు. పైగా.. పరిషత్ ఎన్నికల్లో భారీ విజయంతో వైసీపీ జోష్‌పై ఉంది. అంతేకాదు.. మంత్రి వర్గ విస్తరణలో సీఎం తీరిక లేకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలో సోము చేసిన వ్యాఖ్యలు.. సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయి. సీనియర్లు పెదవి విరిచారు. అందుకే ఎవరూ కూడా సోము వ్యాఖ్యలకు కొనసాగింపుగా ఒక్క కామెంట్ కూడా చేయకపోవడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి