ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గం వారికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులకు పెద్దగా ప్రాధాన్యత లేదన్న చ‌ర్చ‌లు రాజకీయంగా కొంతకాలంగా మనకు వినిపిస్తూనే ఉన్నాయి. వైసీపీలో ఆరుగురు క‌మ్మ‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటి వరకు కమ్మ వర్గానికి చెందిన ఒక నేత కు కూడా జగన్ ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వలేదు. ఇక వైసీపీ నుంచి ఇద్ద రు క‌మ్మ‌ ఎంపీలు ఉన్నారు. వీరిలో గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గా ఉంటే... విశాఖపట్నం ఎంపీ గా ఎం వీవీ సత్యనారాయణ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సత్యనారాయణ వ్యాపార అవసరాల నేపథ్యంలో విశాఖ లో స్థిరపడ్డారు.

గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఆయన విశాఖ ఎంపీ టికెట్ దక్కించుకుని బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ ఓడించి సంచలనం క్రియేట్ చేశారు. ఎంపీగా గెలిచిన అప్పటినుంచి సత్యనారాయణకు వైసీపీలో పెద్దగా ప్రాధాన్యత లేదు. విశాఖ పార్టీ వ్యవహారాలు అన్నీ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కనుసన్నల్లో నడుస్తూ వస్తున్నాయి. దీంతో అక్కడ ఎంపీకు మాత్రమే కాదు మంత్రి అవంతి తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలను కూడా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు.

ఇక ఎంవీవీ ఎప్పుడూ ప్రెస్ మీట్లు జ‌రిగినా విజ‌య‌సాయి ప‌క్క‌న డ‌మ్మీగా ఉంటూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఆయ‌న సొంతంగా క్రేజ్ పెంచుకుంటున్నారు. విజ‌య‌సాయి రెడ్డితో స‌ఖ్య త‌తో ఉంటూనే స్థానికంగా ప్ర‌జ‌ల‌కు అందు బాటులో ఉంటూ.. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌న వంతుగా కృషి చేస్తున్నారు. ఇలా చేయ‌డం ద్వారా వ‌చ్చే ఎన్నికల నాటికి తాను మళ్ళీ రంగంలో ఉండాలని ఎంవీవీ సత్యనారాయణ మాస్టర్ ప్లాన్ తో రెడీ అవుతున్నారన్న చ‌ర్చ‌లు స్థానిక వైసీపీ నేత‌ల్లో వినిపిస్తున్నాయి. ఇక ఈ సీటు విష‌యంలో వైసీపీ నుంచి ఎంవీవీకి పెద్ద‌గా పోటీ కూడా ఎవ్వ‌రూ లేర‌నే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: