ఇటీవల జరిగిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాలను ఊపేస్తున్నాయ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఎంతో ఆవేశంతో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయి. ఇక పవన్ కళ్యాణ్ కామెంట్స్ తో అటు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది. ప్రస్తుతం వైసీపీ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు.


 సీఎం జగన్ ను విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్కు లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో అటు పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ చేసిన షాకింగ్ కామెంట్స్ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారి పోయాయ్ అనే విషయం తెలిసిందే.  ఇటీవలే పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం ని టార్గెట్ చేస్తూ సంచలన విమర్శల పై స్పందించిన ఏపీ మంత్రి పవన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు



 పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలి అంటూ సవాల్ విసిరారు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు 38 ఏళ్ళ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీనే ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక వెనకడుగు వేస్తుంది ఇక జనసేన పార్టీ ఎంత అంటూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఎప్పుడైనా టీడీపీ పోటీ చేసిందా అంటూ ప్రశ్నించారు బాలినేని ఇలా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక మరోవైపు అటు వైసీపీ నేతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు.  కాగా ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ శ్రమాధానం చేసేందుకు సిద్ధం కావడంతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: