గత సంవత్సరం ప్రత్యేక విమాన యాత్రలు చేపట్టి నాపై అనర్హత వేటు వేయాలన్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అన్నారు వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణం రాజు. రాష్ట్ర సమస్యల గురించి కాకుండా కేవలం నా పై అనర్హత వేయాలని మార్గాని భరత్ పిటీషన్ ఇచ్చారు. దానిపై నన్ను కామెంట్ చేయమని అడిగితే 100 పేజీల కౌంటర్ పిటీషన్ ఇచ్చాను అని ఆయన వివరించారు. న్యాయం నావైపే ఉంది అని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ను ఫాలో కాలేదని స్పీకర్ కు ఇచ్చిన పిటీషన్ లో పేర్కొన్నారని ఆయన తెలిపారు.

లోక్ సభలో పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడడానని ప్రముఖంగా పేర్కొన్నానని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలపై మాట్లాడిన విషయాలపై, రాజ్యాంగ రక్షణకోసం మాట్లాడిన ప్రతిమాట మా పార్టీ నేతలకు తప్పుగా అనిపించింది అని వివరించారు. రాజ్యాంగంలోని 10 షెడ్యూల్ నిబంధనలను నేను ఉల్లంఘించలేదని స్పష్టం అయ్యింది అని తెలిపారు. కాబట్టి నాపై స్పీకర్ కు ఇచ్చిన పిటీషన్ కొట్టివేయబడుతుంది అని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా జగన్ ఇచ్చిన హామీలను ప్రస్తుత సీఎంగా ఉన్న జగన్ విస్మరించారు అని విమర్శించారు. కాబట్టి ఆ విషయాలను ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి గుర్తు చేసాను అని వివరించారు.

పార్టీ అధ్యక్షుడి నిర్ణయాలను నేను ఎక్కడా వ్యతిరేకించలేదు అని తెలిపారు. ఇటీవల నేను చేయించిన సర్వేల ప్రకారం మా పార్టీ కి ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ తగ్గుతుంది అన్నారు ఆయన. మా పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉంటే … నేను కూడా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తాను  అని అన్నారు ఆయన. క్యాబినెట్ మంత్రి కూడా కాని కేంద్ర మంత్రి రామే ధాస్ అథవాలే మాటలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నారు. బిజెపి కేంద్ర నాయకత్వం వైఎస్సార్ పార్టీ ని కేంద్ర మంత్రివర్గం లోకి ఒకసారి వద్దనుకున్నప్పుడు, ఇప్పుడు కేంద్రమంత్రి అథవాలే చెబితే తీసుకుంటారా? అని అని ప్రశ్నించారు. వైఎస్సార్ పార్టీని, రామ్ ధాస్ అథవాలే రిపబ్లికన్ పార్టీ లో విలీనం చేసి కేంద్ర మంత్రివర్గంలో చేరవచ్చు అన్నారు. కేసీఆర్ లాగా మా పార్టీ అధ్యక్ష పదవికి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరపాలి. నన్ను అప్పటి వరకు పార్టీలో ఉంచితే… నేను పార్టీ అధ్యక్షపదవికి జగన్ కు వ్యతిరేకంగా పోటీ చేస్తాను అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: