నాడు నేడు కార్యక్రమం లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేసిన సీఎం జగన్ ఇక ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో రూపురేఖలు మార్చేందుకు సిద్ధమయ్యారు.  ఈ క్రమంలోనే ఇటీవల సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ ప్రమాణాలను అనుసరించి బోధనా ఆసుపత్రులలో, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైద్య సిబ్బంది ఉండాలి అంటూ ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించడం గమనార్హం. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం లేదు అంటూ స్పష్టం చేశారు. జిల్లా ప్రధాన కేంద్రాలు కార్పొరేషన్లలో హెల్త్ టిప్స్ పీహెచ్సీలు, సి హెచ్ సి లు ఏరియా ఆస్పత్రులు జిల్లా ఆస్పత్రులు బోధనా ఆసుపత్రులలో వైద్య సిబ్బంది నియామకంపై ఇటీవలే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.




 ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రులలో కూడా నియామకాలు వెంటనే పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఆసుపత్రుల్లో గుర్తించిన ఖాళీలలో అవసరాల మేరకు నియామకాల క్యాలెండర్ ను కూడా రూపొందించినట్లు అధికారుల సమావేశంలో తెలిపారు. అయితే ఈ నెల 20వ తేదీన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేసి డిసెంబర్ 10 వరకు నియామక ఉత్తర్వులు ఇస్తానంటూ వెల్లడించారు అధికారులు. కొత్తగా నిర్మించడానికి నిర్ణయించిన 176 పీహెచ్సీల నిర్మాణంపై కూడా వెంటనే దృష్టి సారించి వేగంగా పూర్తి చేయాలంటూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.




 ఇక ఇది వైద్య విద్యార్థుల అందరికి శుభవార్త అనే చెప్పాలి. కాగా కరోనా వైరస్ కేసులు ప్రస్తుతం దాదాపుగా తగ్గుముఖం పట్టాయి అంటూ సీఎం జగన్ తెలిపారు. అంతేకాకుండా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో కూడా పోస్టుల భర్తీ ప్రక్రియ డిసెంబర్ 5 వరకు పూర్తి చేస్తాము అంటూ అధికారులు సీఎం జగన్కు ఈ సమావేశంలో తెలిపారు. ఇక దీనికి సంబంధించిన ఉత్తర్వులను 21 నుంచి 25 తేదీల మధ్యలో ఇస్తామంటూ తెలిపారు.  అయితే ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఈ భర్తీ ప్రక్రియ మొదలు పెడుతుందా అని ఎదురుచూస్తున్న ఎంతోమంది వైద్య విద్యార్థులు అందరికీ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్ప శుభవార్త అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: