తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల స్వప్నం స్వరాష్ట్రాన్ని సాధించిన అధికార టీఆర్ ఎస్ పార్టీ నేటితో ఇర‌వై సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. కేవ‌లం ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌నే ల‌క్ష్యంగా నాడు డిప్యూటీ స్పీక‌ర్ గా ఉన్న కేసీఆర్ టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి.. తెలంగాణ రాష్ట్ర సమితిని 2001 ఏప్రిల్‌ 27 నాడు జలదృశ్యంలో కేసీఆర్ ప్రారంభించారు. నాడు ఆయ‌న వెంట ప‌దుల సంఖ్య లోనే నేత‌లు ఉన్నారు. అదే టీఆర్ ఎస్ ఈ రోజు దేశ రాజ‌కీయాల్లోనే ఓ సంచ‌ల‌నంగా మారిపోయింది.

ప్ర‌త్యేక రాష్ట్రం ఆవిర్భావంలో ఎన్ని ద‌శ‌లు ఉన్నా కూడా 2009లో కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్షే మలి దశ ఉద్యమానికి ట‌ర్నింగ్ పాయింట్ గా నిలిచింది. అయితే ఇన్నేళ్ల‌లో కేసీఆర్ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేసి చ‌ట్ట స‌భ‌ల‌కు ఎంపికై ఓ రికార్డు క్రియేట్ చేశారు. ఆయ‌న మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంపీ గా పోటీ చేసి గెలిస్తే... రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యే గెలిచారు. ముందు 2001 ఉప ఎన్నిక‌ల్లో సిద్ధిపేట నుంచి గెలిచిన కేసీఆర్‌, 2004 జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల్లో సిద్ధిపేట ఎమ్మెల్యే గా, క‌రీంన‌గ‌ర్ ఎంపీ గా పోటీ చేసి రెండు చోట్లా విజ‌యం సాధించారు.

త‌ర్వాత 2006 లో క‌రీంన‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ గెలిచారు. 2009లో మాత్రం ఆయ‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎంపీ గా కేవ‌లం 14 వేల స్వ‌ల్ప తేడాతో గెలిచారు. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌త్యేక రాష్ట్ర క‌ళ సాకారం అయిన వేళ ఆయ‌న గ‌జ్వేల్ నుంచి ఎమ్మెల్యే గా, మెద‌క్ నుంచి ఎంపీగా ను పోటీ చేశారు. రెండు చోట్లా కేసీఆర్ విజ‌యం సాధించారు. త‌ర్వాత మెద‌క్ ఎంపీ గా రాజీనామా చేశారు. ఇక మొన్న 2018 ఎన్నిక‌ల్లో మ‌రోసారి గ‌జ్వేల్ నుంచి ఆయ‌న రెండో సారి ఎమ్మెల్యే గా గెలిచారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

TRS