హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు అంత సులువు కాదా ? అక్క‌డ గెలుపు విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఆయ‌న టీంలో సందేహాలు పెరిగి పోతున్నాయా ?  తాజాగా నియోజ‌కవ‌ర్గంలో అధికార పార్టీ వాళ్లు ప్ర‌క‌టించిన  తాయిలాలు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాసయాదవ్ తరపున ప్రచారం చేసిన మంత్రి హరీష్ రావు చిత్ర విచిత్రమైన హామీలు ఇచ్చేస్తున్నారు.

ఎంత విచిత్రం అంటే టీఆర్ఎస్ అభ్యర్ధి గెలిస్తే రైతులు తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా చెల్లిస్తార‌ట‌.
రాష్ట్రంలో మరే నియోజకవర్గంలోని రైతుల రుణాలు తీరుస్తామని ప్ర‌భుత్వం చెప్ప‌లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ప్రాంత రైతుల్లో దీనిపై వ్య‌తిరేక‌త వ‌స్తోంది. ఇక ద‌ళిత బంధు విష‌యానికి వ‌స్తే నియోజకవర్గంలో ఉన్న 25 వేల దళితుల ఓట్ల కోసమే ఇప్పుడు ఈ ప‌థ‌కం ప్ర‌క‌టించార‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగానే ఉన్నాయి. ఇక అభివృద్ధి కోసం ఇక్క‌డ కోట్లాది రూపాయ‌లు కుమ్మ‌రించారు.

కులాల వారీగా ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు అనేక హామీలు గుప్పి స్తున్నారు. వామ్మో ఈ విచిత్రాలు చాలానే ఉన్నాయి. 57 ఏళ్ళకే పెన్షనట - 5 వేల ఇళ్ళు పూర్తిచేస్తారట, ఇక స్ధలముంటే చాలు ఇల్లు కట్టుకోవటానికి రు. 5 లక్షలు ఇస్తారట‌. ఇదంతా తూతూ మంత్రం చుప్ అన్న‌ట్టుగా ఉంది. ఎన్నిక‌లు అయ్యాక అస‌లు వీళ్ల‌ను ప‌ట్టించుకునే నాథుడు కూడా ఉండ‌డ‌నే అంటున్నారు.

అస‌లు అధికా ర పార్టీ కి గెలుపు పై న‌మ్మకం ఉంటే ఇన్ని హామీలు ఎందుకు ? ఇంత హ‌డావిడి ఎందుకు ?  అన్న‌ది అంతు ప‌ట్ట‌డం లేదు. రెండు రోజుల క్రితం స‌ర్వేలో కూడా ఈట‌ల 30 వేల పైచిలుకు భారీ మెజార్టీతో గెలుస్తాడ‌ని తేలింది. ఇక ప్లీన‌రీ లోనూ కేసీఆర్ హుజూరా బాద్ ప్ర‌స్తావ‌న తెచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: