అంతేకాకుండా భౌతిక దూరం పాటిస్తూ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకునేవారు. కరోనా వైరస్ ప్రభావం కాస్త తగ్గడం.. అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత మాత్రం నిర్లక్ష్యం పెరిగిపోయింది. వైరస్ అంటే లైట్ తీసుకుంటున్నారు. అయితే ఇలా లైట్ తీసుకోవడం కారణంగానే అగ్రరాజ్యాల్లో మళ్ళీ వైరస్ కేసులు పెరిగిపోయాయి. ప్రస్తుతం అగ్ర రాజ్యాలలో కొత్త వైరస్ తో వణికిపోతూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం బ్రిటన్, రష్యా లాంటి దేశాలలో మళ్లీ లాక్డౌన్ విధించే పరిస్థితి వచ్చింది. అగ్రరాజ్యమైన అమెరికా లో వైరస్ కేసులు భారీగా వెలుగులోకి వస్తున్నాయి.
అటు భారత్లో కూడా జనాల్లో ఇలాంటి నిర్లక్ష్యం బాగా పెరిగిపోయింది అని చెప్పాలి ఇటీవలి కాలంలో ఎవరూ కూడా ఎక్కడా మాస్కు ధరించి కనిపించడం లేదు ఒకప్పటిలా శానిటైజర్ ఉపయోగించడానికి కూడా అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇక భౌతిక దూరం అనే విషయాన్ని అయితే పూర్తిగా గాలికొదిలేశారు అనే చెప్పాలి. ప్రజలందరూ ఇలా నిర్లక్ష్యంతో ఉన్న సమయంలో ప్రస్తుతం దేశంలో కొత్త వేరియంట్ కరోనా వెలుగులోకి రావడం సంచలనం గా మారిపోయింది. బ్రిటన్లో విజృంభిస్తున్న డెల్టా ప్లస్ ఏ వై 4.2 వేరియంట్ ఇటీవల ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఆరుగురు ఈ వైరస్ బారిన పడ్డారు. అటు బెంగళూరులో కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. తెలంగాణలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు ఈ కొత్త వేరియంట్ బారిన పడినట్టు తెలుస్తోంది. దీంతో అందరూ ఈకొత్త వేరియంట్ గురించి భయపడి పోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి