పాదయాత్ర చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి అయిపోరు, పాదయాత్ర చేసిన ప్రతి ఒకరు ముఖ్య మంత్రి కావాలి అంటే కుదరదు వారిలో ప్రజలకు కనెక్ట్ అయ్యే విషయాలు మెండుగా ఉన్నప్పుడే, ఆ నాయకుడు అందులో తామంతా క్షేమంగా సంతోషంగా జీవించగలము అన్న భరోసా వారిపై వచ్చినప్పుడే ప్రజలు ఆ నాయకుడికి ఓటేసి గెలిపిస్తారు. ఎలక్షన్ అనేది ప్రతి నాయకుడికి ఒక పెద్ద పరీక్ష. నాయకుడిగా తమకు ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారో వాటిపై వారి గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ఆ పరీక్షలో నూటికి రెండువందల మార్కులు తెచ్చుకున్నారు వైయస్ జగన్. అత్యధిక మెజారిటీతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించారు.
ఇంతటి మెజారిటీ గుర్తింపు మరే నాయకుడికి దక్కలేదు అనడంలో అతిశయోక్తి కాదు. ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేసిన నాయకులు ఎందరో ఉన్నారు. కానీ అన్ని వర్గాల ప్రజలు అందరితోనూ జేజేలు పలికించుకొని వారి ఓటుని గెలుచుకున్న మహా నేతగా వైయస్ జగన్ గుర్తింపు పొందడం విశేషం. ఆయన గొప్ప నాయకత్వానికి మానవత్వానికి నిదర్శనం. ప్రజలకు మాటల్లో చెప్పడం కాదు, ఇచ్చిన ప్రతి హామీని గుర్తుంచుకుని నెరవేర్చిన గొప్ప లీడర్. మానిఫెస్టోలో లేని హామీలను కూడా ప్రజలకోసం సందర్భానుసారంగా అవసరాన్ని బట్టి అమలులోకి తీసుకు వచ్చి అందరినీ ఆదుకుంటున్నాడు.
పాద యాత్ర కారణంగా ప్రజల గుండె చప్పుడును , వారి ఆకాంక్షలను దగ్గరుండి విన్న ఈ నాయకుడి గుండెలు సంతోషంతో పొంగిపోయేలా ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు అండగా నిలబడ్డారు. కొన్ని సార్లు చిన్న చిన్న వాటి వలన ప్రజలకు కొంత బాధ, భారం కలుగవచ్చు. కానీ వాటన్నింటినీ దాటుకుని ముందుకు వెళితేనే రేపటి ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తును, ఇక్కడి ప్రజల అభివృద్ధిని, ఉన్నతిని చూడగలమని గట్టిగా నమ్మే నాయకులలో వైయస్ జగన్ ఎపుడు ముందుంటారు. ఇప్పుడు ఇంతటి ప్రగతి చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ జగనే రావాలి అంటూ కోరుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి