అదే మంత్రులతో ప్రత్యేక బృందాల ఏర్పాటు ఆలోచన. మోడీ సర్కారు పనితీరు మెరుగుపరచడానికి.. ప్రజలకు ఆమోదయోగ్యం అయ్యేలా తీర్చిదిద్దడానికి మోడీ ఓ కొత్త ప్రయోగం చేస్తున్నారు. 77 మంది మంత్రి మండలి సభ్యులను 8 ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో 9 నుంచి 10 మంది మంత్రులు ఉన్నారు. ఈ బృందాలన్నీ కీలక అంశాలపై మేథో మథనం చేస్తారు. కొత్త విధానాలు రూపొందిస్తారు. ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు వస్తున్నయో చర్చిస్తారు. పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తారు.
ఇంతకీ ఈ ప్లాన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే.. గతంలో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోడీ ఇదే పాలసీ అమలు చేశారట. ఇలాగే మంత్రులను బృందాలు నియమించుకుని అధ్యయనం చేయించారట. అది సత్ఫలితాలు ఇచ్చిందట. ఇప్పుడు అదే ఫార్ములా మరోసారి కేంద్ర స్థాయిలో అమలు చేయిస్తున్నారు మోడీ. ఈ విధానం ఇప్పటికే అమలైందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఈ స్పెషల్ టీమ్స్ సమావేశాలు ఇప్పటి వరకూ దాదాపు ఐదు సార్లు జరిగాయట.
వ్యక్తిగత సమర్థత, కేంద్రీకృత అమలు విధానం, మంత్రిత్వ శాఖ పని తీరు, భాగస్వామ్య దారులు వంటి అంశాలపై స్పెషల్ టీమ్స్ ఫోకస్ చేశాయట. ప్రభుత్వ ప్రధాన పథకాల అమలు, ప్రభుత్వం-పార్టీతో సమన్వయం, సమర్థవంతమైన కమ్యూనికేషన్ వంటి అంశాలపైనా చర్చించాయట. మరి ఈ కొత్త ఐడియా ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో.. మోడీని మూడోసారి ప్రధాని సీట్లో కూర్చోబెడుతుందా.. చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి