ఇటీవలి కాలం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం తడిసి ముద్దయింది అనే విషయం తెలిసిందే. ముఖ్యం గా నెల్లూరు సహా రాయల  సీమ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తో జనజీవనం స్తంభించి పోయింది. చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా కురిసిన అతి భారీ వర్షాల కారణం గా ఎక్కడ చూసినా వరద నీరు నిండి పోయింది. జనావాసాలు సైతం పెద్ద పెద్ద నదులను తలపించాయి. దీంతో ఎటు పోవాలో  తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని బ్రతికారు వరద బాధితులు.


 ఊహకందని రీతి లో భారీ రేంజ్ లో వరదలు రావడంతో ఇక దిక్కు తోచని స్థితిలో పడి  పోయారు. అయితే భారీ వరదల ప్రభావానికి అటు ఏకంగా జనావాసాలు సైతం వరదల్లో కొట్టుకు పోయాయ్ అన్న విషయం తెలిసిందే. ముఖ్యం గా లోతట్టు ప్రాంతా లలో అయితే వరదల కారణం గా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇక పోతే ఇక వరద ప్రభావిత ప్రాంతాల లో ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల పర్యటన చేస్తున్నారు. ఈ క్రమం లోనే బాధితులకు పరిహారం కూడా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.


 అయితే వరదల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు మళ్లీ భారీ వర్షాలు ఉన్నాయి అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం తో అందరూ వణికి పోయారు. కానీ ఇక ఇప్పుడు పెద్ద ముప్పు తప్పినట్లే తెలుస్తోంది. బంగాళాఖాతం లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారకుండా అలాగే కొనసాగుతూ తమిళనాడు శ్రీలంక వైపుకు వెళ్తున్నట్లు ఇటీవల వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాల ముప్పు తప్పినట్లే అంటూ వాతావరణ శాఖ తెలిపింది.అయితే 28, 29 తేదీలలో గుంటూరు నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: