ఎంపీ లాడ్స్ నిధులు.. ఎంపీలు తమ నియోజక వర్గాల్లోని అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేసేందుకు అందజేసే నిధులు.. ఈ నిధులను ఎంపీ తనకు నచ్చిన అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేయవచ్చు.. ఆ విచక్షణ అధికారం సదరు ఎంపీదే. అయితే.. అది అభివృద్ధి కార్యక్రమం అయి ఉండాలి. సాధారణంగా మన ఎంపీలు.. ఆ ఎంపీ నిధులతో.. పల్లెటూర్లకు రోడ్లు వేయించడం.. పాఠశాలలు కట్టించడం.. బస్ షెల్టర్లు కట్టించడం.. వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయడం.. ఇలా తన నియోజక వర్గంలోని సమస్యలను బట్టి.. అవసరాలను బట్టి ఖర్చు చేస్తుంటారు.


అయితే.. ఏపీలో ఈ ఎంపీ లాడ్స్‌ను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొందరు వైసీపీ ఎంపీలు ఈ ఎంపీ లాడ్స్ నిధులతో ఏకంగా చర్చిలు కూడా కట్టించారట. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ తన పార్లమెంటు నిధుల నుంచి 43 లక్షల రూపాయలు ఒక చర్చి నిర్మాణానికి ఖర్చు చేశారని ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధానికి ఫిర్యాదు చేశారు. అలాగే ఏపీ సర్కారు కూడా 248 చర్చిలు నిర్మించేందుకు 25 కోట్ల రూపాయలు కేటాయించిందని రఘురామ కృష్ణంరాజు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రధానికి కంప్లయింట్ చేశారు.


ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యకలపాల్లో ఒక్కొక్క ఎంపీ నుంచి 84 లక్షల నుంచి కోటి రూపాయల వరకు చర్చిల నిర్మాణానికి వెచ్చించారన్నది రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదులో ప్రధాన ఆరోపణ. ఇలా ఒక మతపరమైన కట్టడానికి ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తూ.. అన్ని నిబంధనలకు నీళ్లొదిలారని రఘురామ కృష్ణంరాజు తన కంప్లయింట్‌లో తెలిపారు. ఇప్పుడు ఆ ఫిర్యాదుపై స్పంధించిన కేంద్ర గణాంకాలు, ప్రణాళిక మంత్రిత్వ శాఖ దీనిపై రాష్ట్రం వివరణ కోరింది.

 

రాష్ట్రంలోని ఎంపీ లాడ్స్ నిధులను చర్చిల నిర్మాణం కోసం ఖర్చు చేయడంపై వెంటనే నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం తాజాగా ఆదేశించింది. గతంలోనే ఓసారి ఆదేశించా స్పందన రాలేదని.. మరోసారి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పుడైనా స్పందిస్తారా.. లేదా.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: