దేశం మొత్తం చెప్పుకునేలా దత్తపుత్రుడు పెళ్లి ఆడంబరంగా చేసినటువంటి సీఎం ఆమె. నిండు సభలో దుశ్యాసన పర్వానికి ప్రతీకార చర్యలు తీసుకున్న మహిళ. ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఏ విధంగా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించిందో తెలుసుకుందాం..?
 నాలుగు కేజీల బంగారం 600 కేజీల వెండి, కొన్ని వేల చెప్పులు, చూస్తే అదిరిపోయే ఫర్నిచర్, ఇంట్లో ఎన్నో ఫ్రిజ్జులు టీవీ, ఏసీలు, ఎటు చూసినా విలాసవంతమైన వస్తువులు. పెద్ద షాపింగ్ మాల్ తలపించేలా ఆ నిలయం. దాని పేరే వేద నిలయం. మనం సాధారణంగా చూస్తే ధనవంతుల ఇల్లు ఒక అతపురాన్ని తలపిస్తూ ఉంటాయి. కానీ ఈమె ఇల్లు అంతపురన్నే మించి ఉంది. ఆ నిలయంలో ఉన్నటువంటి  వస్తువులను చూస్తే మన రెండు కళ్ళు సరిపోవు.


అక్కడి ప్రభుత్వ నివేదిక ప్రకారం నాలుగు కేజీల 372 గ్రాముల బంగారం 601 కేజీల 424 గ్రాముల వెండి వస్తువులు ఆమె వేద నిలయంలో ఉన్నాయి. 8376 పుస్తకాలు, 653 ఐటి విభాగానికి చెందిన పత్రాలు, 65 సూట్కేసులు, స్టేషనరీ ఐటమ్స్ 253, కాస్మొటిక్ ఐటమ్స్ 108, ఈ యొక్క వేద నిలయంలో మొత్తం 32721 వస్తువులు అక్కడి ప్రభుత్వ అధికారులు ఒక నివేదిక విడుదల చేశారు. సాధారణంగా ఎంత ధనవంతులైన 60 నుంచి 70 తులాల బంగారం ఇంట్లో ఉంచుకుంటారు. కానీ జయలలిత ఇంట్లో కేజీల కేజీల బంగారం ఉంది. కనీసం ఆలయాల్లో కూడా ఇంత బంగారం ఉండదు. 600 కేజీల వెండి ఉన్నదంటే ఆమె ఏ రేంజ్ లో కూడా పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఇంక చీరలు, చెప్పులు, వాచ్,  ఫర్నిచర్, ఇతర వస్తువులను చూస్తే ఒక పెద్ద షాపింగ్ మాల్ ని చూసినట్టు మనకనిపిస్తుంది. నిజానికి దివంగత సీఎం జయలలిత ఎంతో లక్సరీ లైఫ్ అనుభవించారు.  ఆమెకు చీరలు,నగలు, చెప్పులు బ్రాండెడ్ వాచీలు అంటే అమితమైన ప్రేమ. దీనికి సంబంధించి ఏ బ్రాండ్ వస్తువు మార్కెట్లోకి వచ్చిన అది జయలలిత ఇంట్లోకి రావాల్సిందే. 1996లో ఆమె దత్త కుమారుడికి అంగరంగ వైభవంగా వివాహం చేసింది. తర్వాత అందరి చూపు ఆమె ఆస్తుల  పైనే పడింది. ఆ తర్వాత అధికారుల సోదాల్లో బయటపడినటువంటి వస్తువులను చూసి అంతా షాక్ కు గురయ్యారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన అనంతరం  జయలలిత పూర్తిగా లగ్జరీ లైఫ్ కు దూరమయ్యారు. అంతకుముందు హడావిడిగా కనిపించే జయ సింపుల్ గా మారిపోయారు. కేవలం రెండు రంగుల చీరల్లోనే ఆమె కనిపించేవారు. కానీ ఆమె అమ్మ పేరుతో తమిళనాడులో తీసుకొచ్చిన పథకాలు ఆమెను ఒక దేవతగా చేశాయి. ఆమె మరణం తర్వాత ఆ వేద నిలయం ప్రభుత్వ పరం అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: