పథకాల అమలు బాలేదు
డబ్బులు పంచుతున్నాం కానీ నో యూజ్

జనం మనల్ని నమ్మడం లేదు అన్నది తేలిపోయింది..కొన్ని అంతర్గత సర్వేలలో! ఏం చేయమంటారు మిమ్మల్ని మార్చాలా లేదా మీరే మారుతారా అలాంటి లాంటి మాటలు కాదు చాలా పదునయిన మాటలు సీఎం జగన్ చెబుతున్నా కూడా అంటున్నా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా వైసీపీ లో మార్పు రావడం లేదు. ప్రజా పాలకుల్లో మార్పు లేదు. అందుకే జిల్లాల పర్యటనలకు వచ్చి అధికారుల్లో కాస్తయినా కదలిక తేవాలని, పార్టీలోనూ కాస్త కొత్త జీవం నింపాలని యోచిస్తున్న సీఎం జగన్ కు ఎప్పటికిప్పుడు ఏదో ఒక అవరోధం ఎదురవుతూనే ఉంది.




సంక్రాంతి పండుగ ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నాం. సంక్రాంతి పండుగ తరువాత అయినా జగన్ అన్న వస్తారా అన్న ఎదురుచూపులతో అంతా గడిపేస్తున్నాం. ఇదీ మా శ్రీకాకుళంతో సహా ఇతర ప్రాంతాలలో విస్తరించి ఉన్న సందేహం. ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు అందుకున్నాక ఇంతవరకూ క్షేత్ర స్థాయి పర్యటనలు చేసిన దాఖలాలు చాలా అరుదు. ఏవో కొన్ని సంఘటనలు మినహా..! ఈ తరుణంలో ముఖ్యమంత్రి రాకపై చాలా చర్చలు జరిగాయి. జిల్లాలకు వస్తే స్థానికంగా వ్యతిరేకతలు వ్యక్తం అవుతాయి అన్న భయం కూడా నెలకొని ఉంది జగన్ లో! ఈ తరుణంలో ఏం చేయాలో అంతుపోలక కొంత కాలం జిల్లాల పర్యటనలు సైతం వాయిదా వేసుకున్నారు జగన్. కానీ ఇప్పుడు రాక తప్పదు. జిల్లాలలో నాయకుల మధ్య సమన్వయ లోపాలను దిద్దేందుకు తన పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఒకటి తెలుసుకునేందుకు అయినా ఆయన రాక తప్పదు.  




ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. పథకాల అమలు, వాటిలో ఉన్న లోపాలు వీటిపై దృష్టిసారిస్తే బాగుంటుందని ఇప్పటికే చాలా సార్లు ఏపీ సీఎంఓ చెబుతూనే ఉంది. అయినప్పటికీ మార్పులయితే రాలేదు. శ్రీకాకుళం మొదలుకుని అనంతపురం దాకా చాలా సమస్యలపై మంత్రుల స్పందనలే లేవు. ఈ క్రమంలో ప్రజాభిప్రాయం అన్నది జగన్ కు వ్యతిరేకంగా ఉందన్న వాదన బలీయంగా వ్యక్తీకరణ అవుతోంది. దీనిని తగ్గించేందుకు అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎంపీలలో మార్పు తెచ్చేందుకు సీఎం జిల్లాల  పర్యటనకు ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: