అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో ఆయన సీనియర్ నేత, పార్లమెంట్ లో బలహీనవర్గాల గొంతుక, దశాబ్దాలుగా కాంగ్రెస్తో అనుబంధం ఉన్న నేత, అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సేవలందించిన వ్యక్తి. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనిది మీడియాతో మాట్లాడారు. తెలుగ రాష్ట్రాల మఖ్యమంత్రులను ఎకి పారేశారు. ఇంతకీ ఎవరా నేత ? ఆయన ఏమన్నారు ?
తమిళనాడులోని నీలగరి కనుమల్లో ఇటీవల జరిగిన హెలికాఫ్ట ర్ దుర్ఘటనలో మరణించిన వీర సైనికులకు తెలుగు రాష్ట్రాల స్పందన అంతంత మాత్రంగానే ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత విమర్శలు చేశారు. ఆయన చేసిన విమర్శలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ అగ్గిని రాజేశాయి. ఆయన విమర్శలు తెలుగు ప్రభుత్వాలపై ఉన్నా కూడా .. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ శ్రేణులకు తగిలేలా వ్యాఖ్యలు చేశారాయన. ఇటీవలి దుర్ఘటనలో చిత్తూరు జిల్లా వాసి సాయితేజ మరణించిన విషయం విదితమే. ఆ అమరవీరుడికి నివాళులర్పించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి హాజరు కాక పోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదే నా మనం సైనికులకు ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు. తమ చర్యల ద్వారా ప్రజలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం సందేశం ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ వాసి పై అక్కడి ప్రభుత్వం ప్రవర్తించిన తీరు చాలా బాధ కలిగించిందని హనుమంత రావు ఆవేదన వ్యక్తం చేశారు. సాయితేజ పార్ధీవ దేహానికి నివాళులర్పిేంచడానికి మంత్రులు ఎవరూ వెళ్లక పోవడం శోచనీయమని హనుమంతరావు విమర్శించారు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పై తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. కెసిఆర్ ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికీ తెలియదన్నారు. గతంలో సానియా మిర్జాకు, పివి సింధుకు కోట్లాది రూపాయలు నగదు బహుమతులు ఇచ్చిన విషయాన్ని హనుమంతరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతే కాకుండా ఇటీవలే రాష్ట్రేతర రైతులకు అంటే రైతు చట్టాలపై కర్షకులు చేసిన పోరాటంలో అశువులు బాసిన రైతులకు కెసిఅర్ ఆర్థిక సాయం అందజేస్తానని ప్రకటించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ... కెసిఆర్ కు మరణించిన జవాన్ సాయితేజ గుర్తుకు రాకపోవడం శోచనీయమని పేర్కోన్నారు. సాయి తేజ తల్లితండ్రుల దేశానికి ఇద్దురు సంతానాన్ని ఇచ్చారని, ఈ విషయం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలియదా? అని హనుమంత రావు ప్రశ్నించారు. తెలుగు ప్రజల్ని తెలుగు వాళ్లు గౌరవించుకోక పోవడం శోచనీయమన్నారు హునుమంతన్న.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి