2019 ఎన్నికల్లో అంజిరెడ్డి అన్నపురెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన నియోజకవర్గ బాధ్యతలను పట్టించుకోకపోవడంతో ఆయన స్థానంలో 2014లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన మరో నేత కొమ్మారెడ్డి చలమారెడ్డి నే తిరిగి ఇన్ చార్జ్ గా నియమించారు. అయితే ఆయన ఆధ్వర్యంలో టిడిపి పుంజుకోలేదు. దీంతో మళ్లీ సీనియర్ నేత జూలకంటి బ్రహ్మా రెడ్డినే బాబు ఇన్ చార్జ్ గా నియమించారు.
ఇక మాచర్ల లో 1983లో టీడీపీ గెలిచింది. ఆ తర్వాత 1985 లో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత టీడీపీ 1989 - 1994- 1999 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. అయితే 2004 నుంచి వరుస ఓటములే వెక్కిరిస్తున్నాయి. 2004లో మాత్రం పిన్నెల్లి లక్ష్మారెడ్డి గెలిచారు. ఆ తర్వాత వరుసగా రామకృష్ణా రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. అయితే నియోజకవర్గంలో టీడీపీ పరంగా పేరున్న జూలకంటి ఫ్యామిలీ దగ్గర డబ్బులు లేవనే బాబు ఆ ఫ్యామిలీని పక్కన పెడుతూ వచ్చారు.
వరుస ఓటములతో ఎదురు దెబ్బలు తిన్న బాబు.. డబ్బును చూసి కాదు పేరును చూసి సీటు ఇస్తేనే అక్కడ టీడీపీ జెండా ఎగురుతుందని తిరిగి బ్రహ్మా రెడ్డికి పార్టీ పగ్గాలు ఇచ్చారు. ఇప్పుడు పార్టీ కేడర్ కూడా వచ్చే ఎన్నికల్లో తాము బ్రహ్మారెడ్డిని గెలిపించి.. మాచర్లను బాబుకు కానుకగా ఇస్తామని చెపుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి