వెంకటేష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గోపాల గోపాల సినిమా దాదాపు తెలుగు ప్రేక్షకులందరూ కూడా చూసే ఉంటారు. ఈ సినిమాలో నాస్తికుడిగా నటిస్తాడు  వెంకటేష్. ఈ క్రమంలోనే తన షాప్ కి వచ్చిన నష్టాన్ని పూడ్చడానికి అంటూ కోర్టుకు దేవుడునీ తీసుకు రావాలి అంటూ కోరుతాడు వెంకటేష్. అయితే దేవుడు ఎక్కడున్నాడు ఒకసారి కోర్టుకు తీసుకు రావాలి అంటూ వెంకటేష్ డైలాగులు చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలాంటివి సినిమాల్లో చూడ్డానికి బానే ఉంటాయి. కానీ నిజ జీవితంలో మాత్రం ఇలాంటివి జరగవు. కానీ ఇక్కడ మాత్రం అచ్చంగా గోపాల గోపాల సినిమా లో లాంటి ఒక సన్నివేశం చోటు చేసుకుంది.



ఏకంగా కోర్టులో జడ్జి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి దేవుడి మూలవిరాట్ ను కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా  మారిపోయింది అని చెప్పాలి. తిరుపూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్రాస్ హైకోర్టు ఈ వ్యవహారం పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తిరుపూర్ జిల్లాలో ఉన్నటువంటి పరమశివుడు ఆలయంలో శివుడికి సంబంధించినటువంటి విగ్రహం చోరీకి గురైంది. అయితే ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి ఇక విగ్రహాన్ని దొంగిలించిన దొంగని పట్టుకొని విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని ఆలయ నిర్వాహకులు అప్పజెప్పారు.



 ఎప్పటిలాగానే ఆలయ నిర్వాహకులు గర్భాలయంలో శివుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే విగ్రహాల చోరీ కేసు మీద విచారణ జరుపుతున్న టువంటి కుంభకోణం ప్రత్యేక కోర్టు న్యాయాధికారి ఇక ఆ గర్భాలయంలో ప్రతిష్టించిన మూలవిరాట్ ని తమ ఎదుట హాజరు పరచాలి అంటూ ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారిపోయింది . దీంతో షాకైన ఆలయ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. గర్భాలయంలో ప్రతిష్టించిన మూలవిరాట్ ను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేయడం ఏంటి అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక అడ్వకేట్ ద్వారా మూలవిరాట్ గురించి విచారణ జరిపి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది హైకోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

God