ఈ మాట కొన్ని నెల‌లుగా పార్టీలో వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు మ‌రింత ఎక్కువైంద‌ని అంటున్నారు ప‌రిశీ ల‌కులు. ``రాష్ట్రంలో ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సినిమా టికెట్ల నుంచి పెట్రోల్ ధ‌ర‌ల వ‌ర‌కు.. నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల నుంచి రేష‌న్ పంపిణీ వ‌ర‌కు అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల‌నుంచి కూడా భిన్న‌మైన ఫీడ్ బ్యాక్ వ‌స్తోంది. ఆయా విష‌యాలు ప్ర‌భుత్వం తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

లేక‌పోతే.. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ప్ర‌చారాన్నే ప్ర‌జ‌లు విశ్వ‌సించే ప్ర‌మాదం ఉంది`` ఇదీ.. ఇప్పుడు వైసీపీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల సారాంశం. అయితే.. ఇంత‌కీ నేత‌లు చెబుతున్న మాటేంటంటే.. సీఎం సార్ నోరు విప్పి.. త‌మ‌తో మాట్లాడాల‌ని!  ఎందుకంటే. దాదాపు రెండేళ్లుగా కార్య‌క‌ర్త‌ల‌తో సీఎం జ‌గ‌న్ భేటీ అయింది లేదు. వారిని ఉద్దేశించి ఆయ‌న చెప్పిన మాట కూడా లేదు. కానీ.. క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు మాత్రం త‌మ ప‌నితాము చేసుకుని పోతున్నా రు.

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను క్షేత్ర‌స్థాయిలో ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. సీఎం జ‌గ‌న్‌కు.. కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య భారీ గ్యాప్ పెరిగిపోయింది. పార్టీ అధికారంలోకి రాకముందు.. క‌నీసం నెలకు రెండు సార్ల‌యినా.. ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడి. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని అంచ‌నా వేసుకునేవారు. దీంతో కార్య‌క‌ర్త‌లు త‌మ మ‌నసులో ఏముందో చెప్పుకొనేవారు. అయితే.. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. దీనిని గ‌మ‌నించిన టీడీపీలోని కొంద‌రు నేత‌లు.. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు గేలం వేస్తున్నారు. ``మీరు ఎంత చేసినా.. మీ నాయ‌కుడు మీకు ఎలాంటి గుర్తింపు ఇవ్వ‌రు`` అని టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు.

దీనిని న‌మ్ముతున్న కొంద‌రు కార్య‌క‌ర్త‌లు.. టీడీపీలోకి జంప్ చేస్తున్నారు. ఇక‌, దీనిని న‌మ్మ‌ని వారు మాత్రం సీఎం సార్ ఇప్ప‌టికైనా.. నోరు విప్పాల‌ని కోరుతున్నారు. త‌మ‌కు కూడా కొన్ని స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని.. త‌మ మాట‌ను కూడా సీఎం వినిపించుకోవాల‌ని.. వారు కోరుతున్నారు. అంతేకాదు.. ప్ర‌తి విష‌యంలోనూ.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటే.. సీఎం త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోతే.. ఎలా అనే ఆవేద‌న వ‌కూడా వారిలో క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: