నేడు ఎన్టీఆర్ 26 వ వర్ధంతి అన్న సంగతి తెలిసిందే.  ఎన్టీఆర్ 26 వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ,రామకృష్ణ, సుహాసిని ఇతర కుటుంబ సభ్యులు.. అయితే..  కరోనా సోకడం కారణంగా ఎన్టీఆర్ 26 వ వర్ధంతి కార్యక్రమాలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ దూరం కానున్నారు. అనంతరం రసూల్ పురా లోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు బాలకృష్ణ. అటు ఉదయం 12 గంటలకు ఎన్టీఆర్ భవన్ లో లెజండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించనున్నారు ట్రస్టు చైర్మన్ నారా భువనేశ్వరి.. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్ జీవితం అందరికి ఆదర్శమని.. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఉంటారన్నారు. తెలుగు జాతిలో ఎన్టీఆర్ పుట్టడం మన అదృష్టమన్నారు.

 కాంగ్రెస్ ను కూకటి వేళ్లతో పెకల్చిన వ్యక్తి ఎన్టీఆర్.. అని.. స్థానికులు అక్కడే ఉద్యోగాలు కల్పించాలని ఇపుడు పోరాడుతున్నారని చెప్పారు.తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం అన్న ఎన్టీఆర్  తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి 40 ఏళ్ళు పూర్తయిందన్నారు అశోక్ గజపతి రాజు. టీడీపీ పాలన ప్రజా సంక్షేమ లక్ష్యంగా కొనసాగిందన్నారు అశోక్ గజపతిరాజు.  ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదని తెలిపారు  అశోక్ గజపతిరాజు.  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పాలన అంతా అయోమయంలో ఉందన్నారు  అశోక్ గజపతిరాజు. ప్రార్ధన స్థలాలకు వెళితే కరోన పెరుగుతాదట...మరి పాఠశాలల్లో పెరగదా...? అని ప్రశ్నించారు  అశోక్ గజపతిరాజు. ప్రజాస్వామ్యాన్నీ రాజ్యాంగ బద్దంగా నడపడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు  అశోక్ గజపతిరాజు. కరోనా జాగ్రత్తలు తీసుకొని ప్రజా సమస్యలపై పోరాడాలని డిమాండ్‌ చేశారు  అశోక్ గజపతిరాజు.  జిల్లా అడ్మినిస్ట్రేషన్ ను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ పాలన ఉందని.. అందుకే కోవిడ్ నియంత్రణపై సరైన కట్టడి లేదని వెల్లడించారు  అశోక్ గజపతి రాజు.


మరింత సమాచారం తెలుసుకోండి: