ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్న వేళ భారతీయ జనతా పార్టీ రాజకీయంగా భారీ పాచిక విసిరింది ఆ పార్టీ దెబ్బకు ఉత్తరప్రదేశ్లోని రాజకీయపక్షాలకు దిమ్మతిరిగినట్లయింది.. సీనియర్ కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి ఆర్ పి ఎన్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పేశారు. చాలా కాలం క్రితం ఆయన పార్టీ వీడుతారనే పుకార్లు వచ్చాయి అయితే అవి కొద్దికాలానికి సమసిపోయాయి. ఎవరూ ఊహించని విధంగా సింగ్ తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు. భారతదేశం ప్రస్తుతం రిపబ్లిక్ దినోత్సవం జరుపుకుంటున్న దని, ఈ సందర్భంగా తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొత్త రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు అని పేర్కొన్నారు. చాలా విషయాలని ఆయన తన లేఖలో ప్రస్తావించినట్లు తెలిసింది. చివరగా ఆయన జై హింద్ అంటూ తన లేఖను పూర్తి చేశారు. ఈయన కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకమైన వ్యక్తి గా పేరు తెచ్చుకున్నారు. గతంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు 15వ లోక్ సభలో అంటే 2009 నుంచి 2014 వరకు కుషినగర్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు ఆయన తండ్రి కూడా కాంగ్రెస్ వాదే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకూ ఆయన జార్ఖండ్ రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలు పరిశీలకుడిగా పని చేశారు చాలా కాలం పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఎక్కడ ఉన్నారుఎన్నికల వేళ సింగ్ కాంగ్రెస్ ను విడిపోవటం ఆ పార్టీకి గట్టి దెబ్బ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు...
తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని ఉన్న ప్రధాన రాజకీయ కుటుంబాలన్నీ కూడా ఒకటిగా  ఆ పార్టీని వీడుతున్నాయి.గత ఏడాది జితిన్ ప్రసాద్ , ఫలెరో,  సుస్మితా దేవ్,  కీర్తి అజాద్,  అశోక్ తదితరులు కాంగ్రెస్ ను వీడారు. 2021 జాన్ నెలలో  బీజేపీలో చేరిన ప్రసాద్ కేంద్ర మంత్రి అయ్యారు.  2021 ఆగస్టులో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టి తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అదేవిధంగా గోవా మాజీ ముఖ్యమంత్రి, ఫలెరో, కీర్తి అజాద్ తదితరులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాజాగా కాంగ్రెస్ గుడ్ బై చెప్పిన ఆర్.పి.ఎన్. .సింగ్ కొద్ది సేపటి క్రితం భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ కండువాను కప్పుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: