గత కొన్ని నెలల నుంచి ఉక్రెయిన్ సరిహద్దులో తీవ్రస్థాయిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే విధంగా మారిపోయింది. అమెరికా స్వయంగా కలగజేసుకుని ఎన్నోసార్లు రష్యాతో చర్చలు జరిపినప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయకపోవడం గమనార్హం. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేసి ఇక ఉక్రెయిన్  భూభాగాన్ని తమ దేశంలో కలుపుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో లక్షల సంఖ్యలో సైనికుల మోహరించింది రష్యా. అదే సమయంలో అటు ఉక్రెయిన్ కి మద్దతుగా ఉన్న  నాటో దళాలు యూరోపియన్ యూనియన్ దేశాలకు సంబంధించిన దళాలు కూడా ఉక్రెయిన్ చేరుకోవటం గమనార్హం.



 అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే  ఏ క్షణంలో యుద్ధం జరిగిన ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు అని అటు నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఉక్రెయిన్ లో ఉన్నటువంటి రాయబార కార్యాలను మూసివేసి ఇక  రాయబారులను వెనక్కి రప్పించేందుకు సిద్ధమవుతున్నాయి అన్ని దేశాలు. అంతేకాదు ఉక్రెయిన్ లో ఉన్నటువంటి తమ దేశానికి చెందిన పౌరులను కూడా వెనక్కు రప్పించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ఇటీవలే ఇజ్రాయిల్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది.



 ఇజ్రాయిల్కు చెందిన యూదులు దాదాపు 75 వేల మంది ఉక్రెయిన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక వారందరినీ కూడా వెనక్కి రావాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది.  ఇక అందరినీ వెనక్కి తీసుకు వచ్చేందుకు ఏకంగా ప్రత్యేకమైన విమానాలను కూడా ఉక్రెయిన్ కు పంపిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటికే ఎన్నో దేశాలు తమ దేశ పౌరులను వెనక్కి తీసుకెల్తూ ఉండగా.. ఇప్పుడు ఇజ్రాయిల్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ పరిస్థితులను చూస్తుంటే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మాత్రం తప్పదు అనే విధంగానే మారిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: