శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఆషీకీ 3’ (Aashiqui 3) చిత్రంతో జరగబోతోంది. అనురాగ్ బసు దర్శకత్వంలో వస్తున్న ఈ మ్యూజికల్ లవ్ స్టోరీలో శ్రీలీల, చాక్లెట్ బాయ్ కార్తీక్ ఆర్యన్‌కు జోడీగా నటిస్తోంది.ఈ సినిమాలో స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఇంటిమేట్ సీన్స్ ఉన్నా, శ్రీలీల వెనకడుగు వేయలేదు. తాను ఒక ‘డైరెక్టర్స్ హీరోయిన్’ అని నిరూపించుకోబోతోంది. గతంలో శ్రద్ధా కపూర్ కెరీర్‌ను ‘ఆషీకీ 2’ ఎలా మార్చేసిందో, ఇప్పుడు శ్రీలీలకు కూడా అదే రేంజ్ సక్సెస్ దక్కుతుందని బాలీవుడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
కార్తీక్, శ్రీలీల ఇద్దరూ అద్భుతమైన డ్యాన్సర్లు కావడంతో, ఈ మ్యూజికల్ హిట్ లో వీరి స్టెప్పులు థియేటర్లను షేక్ చేయడం ఖాయం!‘ఆషీకీ 3’ సెట్స్‌లో ఉండగానే, కార్తీక్ ఆర్యన్-శ్రీలీల కాంబినేషన్ లో మరో సినిమా చర్చల్లోకి వచ్చింది. దీనికి ‘ఫీటమ్ పురా’ (Feetum Pura) అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇదొక భారీ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఒకేసారి రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటించడం అంటే శ్రీలీల రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పొచ్చు.
తెలుగు, హిందీ మాత్రమే కాదు.. ఇప్పుడు తమిళ తమ్ముళ్లను కూడా శ్రీలీల పలకరించబోతోంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ 55వ చిత్రంలో (D55) శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.ధనుష్‌తో నటించే ఛాన్స్ కోసం ఎంతోమంది స్టార్ హీరోయిన్లు క్యూలో ఉన్నా, చివరకు ఆ లక్ శ్రీలీలనే వరించింది. ఈ సినిమాతో కోలీవుడ్‌లో కూడా శ్రీలీల జెండా పాతడం ఖాయంగా కనిపిస్తోంది.త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో శ్రీలీల నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా విడుదలయ్యి హిట్ టాక్ తెచ్చుకుంటే, టాలీవుడ్‌లో శ్రీలీల పేరు మళ్ళీ మారుమోగిపోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి