బుచ్చయ్య చౌదరీ..అబ్బో ఈ పేరు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు..బుచ్చయ్య అంటే తెలుగు ప్రజలకు బాగా తెలుసు. ఎన్నో ఏళ్లుగా రాజకీయం చేస్తున్న బుచ్చయ్య..టీడీపీలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో అందరికీ తెలుసు. రాజకీయంగా ప్రత్యర్ధులపై విరుచుకుపడటమే కాదు...తేడా వస్తే సొంత పార్టీని కూడా వదలరు. అందుకే బుచ్చయ్యని రాజమండ్రి ప్రజలు ఇంతకాలం ఆదరిస్తూనే ఉన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు.

ఇక అలాంటి నేతకు చెక్ పెట్టాలంటే ప్రత్యర్ధులు ఇంకా పక్కా ప్లాన్‌లతో ముందుకు రావాలి...అప్పుడే బుచ్చయ్యని ఓడించడం కుదురుతుంది. కానీ వైసీపీ అలాంటి ప్లాన్‌లతో వస్తున్నట్లు కనిపించడం లేదు. రాజమండ్రి సిటీ నుంచి రూరల్‌కు వచ్చి..గత రెండు ఎన్నికల్లో బుచ్చయ్య సత్తా చాటిన విషయం తెలిసిందే. మామూలుగా బుచ్చయ్యకు సిటీపై ఎక్కువ పట్టున్న విషయం తెలిసిందే. అక్కడే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

అయితే చంద్రబాబు మాట మీద పట్టు లేని రూరల్‌కు వచ్చి కూడా తన పట్టు నిలుపుకున్నారు. అంటే రాజమండ్రి పరిధిలో బుచ్చయ్య ఫాలోయింగ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇలా స్ట్రాంగ్‌గా ఉన్న బుచ్చయ్యకు చెక్ పెట్టడానికి వైసీపీ నానా ప్రయత్నాలు చేస్తుంది. వరుసగా రెండు ఎన్నికల్లోనూ బుచ్చయ్యని ఓడించలేకపోయింది. ఆకుల వీర్రాజు వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోతూ వచ్చారు..దీంతో ఆయన వల్ల కాదని చెప్పి టీడీపీ నుంచి చందన రమేష్‌ని వైసీపీలో చేర్చుకున్నారు. అలాగే ఆయన తనయుడు నాగేశ్వర్‌కు రూరల్ కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు.

ఇటు ఎంపీ మార్గాని భరత్ సైతం రూరల్‌లో వైసీపీని చూసుకుంటున్నారు...అలాగే మరొక సీనియర్ ఆకుల సత్యనారాయణ సైతం వైసీపీలో పనిచేస్తున్నారు. ఇంతమంది బుచ్చయ్యని ఓడించడానికి పనిచేస్తున్నారు. మరి బుచ్చయ్య బలం ఏమన్నా తగ్గించగలిగారా? అంటే పెద్దగా లేదనే చెప్పాలి. రూరల్‌లో ఆయన ఇంకా స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. మరి ఆయన మీద వైసీపీ నుంచి ఎవరిని నిలబెడతారో క్లారిటీ లేదు. ఎవరు నిలబడిన ఆయన్ని ఓడిస్తారా? లేదా అనేది డౌట్?    

మరింత సమాచారం తెలుసుకోండి: