రాధేశ్యామ్ సినిమా విడుదల సందర్భంగా ఏపీ సీఎం జగన్ హీరో ప్రభాస్‌కు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. వంద కోట్ల బడ్జెట్ లో ప్రభాస్ నటించిన రాధే శ్యాం చిత్రం కోసం ప్రీమియం టికెట్ ధర పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. ప్రీమియం టికెట్ ధర 25 రూపాయలు అదనంగా  పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాధే శ్యాం సినిమా బడ్జెట్  170  కోట్లుగా జిఎస్టీతో పాటు ఇతర అక్కౌంట్లు బిల్స్ ను ఏపీ ప్రభుత్వానికి సినిమా నిర్మాణ సంస్థ అందించింది.


హీరో, హీరోయిన్ల రెమ్యూనరేషన్లు కాకుండానే సినిమా నిర్మాణానికి రూ. 100 కోట్ల బడ్జెట్ అయితే.. ఆ సినిమాలకు టికెట్ రేటు పెంచుకునే వెసులుబాటును ఇస్తామని గతంలో జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. గతంలో సినిమా టికెట్ల విషయం గురించి, ఇతర సినిమా సమస్యల గురించి చర్చించేందుకు చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి వంటి సినిమా ప్రముఖులు వచ్చినప్పుడు భారీ బడ్జెట్ సినిమాల విషయం కూడా చర్చకు వచ్చింది. ఆ సమయంలో జగన్ సర్కారు భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేటు పెంచుకునే వెసులుబాటు ఇస్తామని హామీ ఇచ్చారు.


ఆ హామీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు రాధేశ్యామ్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థ మరోసారి ప్రభుత్వాన్ని సంప్రదించి టికెట్ రేటు పెంచుకునే వెసులుబాటు హామీని గుర్తు చేసింది. సినిమా నిర్మాణానికి అయిన వ్యయం ఖర్చు లెక్కులు చూపించి ప్రభుత్వాన్ని ఒప్పించింది. దీంతో మొదటిసారిగా ఏపీ సర్కారు ప్రీమియం టికెట్ రేటు పెంచుకునే వెసులుబాటును రాధేశ్యామ్ సినిమాకు ఇచ్చింది.


అలాగే.. మొన్నటికి మొన్న ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు పెంచుతూ జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాని ఫలితం కూడా మొదట దక్కించుకున్నది ప్రభాస్ సినిమా రాధేశ్యామే అని చెప్పాలి. మొత్తానికి హీరో ప్రభాస్‌కు జగన్ సర్కారు అనుకూలంగా నిర్ణయం తీసుకుని కలెక్షన్లు పెరిగేందుకు పరోక్షంగా దోహదం చేసిందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: