ఇక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ప్రజల కోరికలను కేంద్రం పెద్దలకు వివరిస్తామని చెప్పారు. అలాగే మన రాష్ట్రంలో అధికారం మీద వాంఛతో చేస్తున్న పనులు ఎలా ఉంటున్నాయి అనేది కూడా చూస్తున్నాం అన్నారు. అధికారులకు సేవ చేయడం కన్నా.. అధికారమే లక్ష్యంతో పని చేస్తున్నాయని అలాగే రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో తప్పకుండా మార్పు రావాలని ప్రజలు ఎంతగానో ఎదురు చుస్తున్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో తన వంతు బాధ్యతగా కేంద్రం ధరలు తగ్గించింది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు పన్నులను తగ్గించడం లేదు. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం వల్ల మాత్రమే పెట్రోల్ రేట్లు పెరిగాయి.
అయితే వైసీపీ పాలనలో మాత్రం ప్రతి ఒక్క వ్యవస్థ కూడా నాశనమయ్యాయి. అలాగే మా ప్రణాళికలు మాకు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే మేము పని చేస్తాం అంటున్నారు పురందేశ్వరి. దేశ సేవ కోసం బీజేపీ పార్టీ ప్రతి కార్యకర్త కూడా పునరంకితం అవ్వాలని ప్రతి ఒక్కరని కోరారు. అలాగే ఇటీవల ముగిసిన ఎన్నికలలో నాలుగు రాష్ట్రాల్లోను బీజేపీ పార్టీకే పట్టం కట్టారు. ఇక ఉత్తర్ ప్రదేశ్ లో రెండో సారి కూడా అధికారంలోకి రావడం అంటే బీజేపీ పాలనపైన ప్రజలకు ఉన్న నమ్మకం ఇప్పటికే అర్థం చేసుకోవాలి. మోడీ ప్రధానిగా ఉన్న ఎనిమిదేళ్ళ కాలంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. అలాగే దేశంలోని పేదల భవిష్యత్తు కోసం ఎంతగానో కృషి చేశారు. బీజేపీలోని ప్రతి కార్యకర్త కూడా పార్టీ గెలుపు కోసంమే కృషి చేయాలి. సబ్ కా వికాస్ , సబ్ కా విశ్వాస్, సబ్ కా సాత్, సబ్ కా ప్రకాశ్ అనే సూత్రంతో ఇంకా ముందుకెళ్తున్నాం అన్నారు. అయితే ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి