అయితే ఆఖరి రౌండ్ ఫలితం వస్తే కానీ విజేత ఎవరో తెలియలేదు. అంతలా రౌండ్ రౌండ్ కి గెలుపు వైసీపీ టీడీపీ ల మధ్య దోబూచులాడింది. అయితే ఆఖరికి కేవలం రెండు వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గెలుపొందారు. ఈ షాక్ ను ఊహించని నారాయణకు మరియు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కంగుతిన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నారాయణ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నది లేదు. కాగా మూడు సంవత్సరాల తర్వాత జగన్ తన పాలనలో చేసిన కొన్ని పొరపాట్లు కారణంగా మళ్ళీ టీడీపీ పుంజుకుంటుంది అన్న ఆశలు వారిలో చిగురించాయి.
కాగా ఇప్పుడు అందరి దృష్టి రానున్న ఎన్నికల మీదనే నిలిపారు. చంద్రబాబు సైతం రాష్ట్రము అంతటా మీటింగ్ లను కండక్ట్ చేస్తూ కార్యకర్తలలో మార్పును తీసుకువస్తున్నాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం సింహపురి రాజకీయాలలోకి మాజీ మంత్రి నారాయణ త్వరలోనే తెరమీదకు రానున్నారట. నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే స్థానానికి మళ్ళీ టీడీపీ తరపున పొంగూరు నారాయణ పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి