మార్గదర్శి చిట్ ఫండ్స్ ఛైర్మన్ రామోజీరావులో ప్రభుత్వం టెన్షన్ పెంచేస్తోందా ? తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలోని మార్గదర్శి బ్రాంచీలపై దాడులు జరుగుతున్నాయి. సీఐడీ, విజిలెన్స్, రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ తదితర శాఖల ఉన్నతాధికారులు ఏకకాలంలో చాలా శాఖలపై దాడులు మొదలుపెట్టారు. దాంతో రామోజీతో పాటు ఎండీ శైలజలో కూడా ఆందోళన పెరిగిపోవటం ఖాయం.
ఎందుకంటే ఇప్పటికి రెండుసార్లు విచారణకు హాజరుకావాలని సీఐడీ నోటీసులిస్తే రెండుసార్లూ రామోజీ, శైలజ విచారణకు హాజరుకాలేదు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఒకసారి, విజయవాడ బ్రాంచ్ ఆఫీసులో మరోసారి విచారణకు రమ్మని సీఐడీ స్పష్టంగా నోటీసులిచ్చింది. అయితే రెండుసార్లూ వీళ్ళు నోటీసులను ఖాతరుచేయలేదు. ఈనెల 16వ తేదీన రామోజీ, 17వ తేదీన శైలజ విచారణకు గైర్హాజరయ్యారు. ఇదే సమయంలో మార్గదర్శి బ్రాంచీలపై ఉన్నతాధికారుల బృందాలు దాడులు మొదలుపెట్టాయి.
ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వేస్తున్న చిట్స్ తో పాటు అనేక రికార్డులను కూడా పరిశీలిస్తున్నారట. అలాగే ఆపీసులన్నీ నియమ, నిబంధనల ప్రకారమే ఉన్నాయా లేదా అన్న విషయాలను కూడా చూస్తున్నట్లు సమాచారం. అంటే ఫైర్ సేఫ్టీ లాంటివి కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ ఏచిన్న ఉల్లంఘన జరిగినా వెంటనే సదరు బ్రాంచ్ మేనేజర్లను అదుపులోకి తీసుకోవటం అందరు చూస్తున్నదే.
ఇప్పటికే మార్గదర్శిలో అనేక నియమ, నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అసలు మార్గదర్శి వ్యాపారమే చట్ట ఉల్లంఘనగా ఎప్పుడో తేల్చేశారు. ఏ చట్టం ప్రకారం మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యాపారం చేస్తున్నారని అడిగితే రామోజీ లేదా శైలజ ఎలాంటి సమాధానం చెప్పటంలేదు. పైగా తమ వ్యాపారం తమిష్టం అన్నట్లుగా సమాధానాలు చెప్పారట. చిట్ ఫండ్స్ డిపాజిట్లను వివిధ కంపెనీల మ్యూచువల్ ఫండ్లలో మార్గదర్శి పెట్టుబడులు పెట్టిన విషయం బయటపడింది. ఇదికూడా నూరుశాతం నిబంధనల ఉల్లంఘనే అనటంలో సందేహంలేదు. మరి చివరకు ఉన్నతాధికారులు తాజా దాడుల్లో ఏమి తేలుస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి