వైఎస్ షర్మిళ ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. జగన్ ను జైలుకు పంపిన పార్టీలో షర్మిళ చేరారంటూ వైసీపీ శ్రేణులు ఆమెను విమర్శిస్తున్నారు. అయితే దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి కుమారుడు, కుమార్తె గానే వైఎస్ జగన్ కు, షర్మిళకు గుర్తింపు ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించింది కూడా ఆ కోణంలేనే.


మరోవైపు జగన్ కూడా తన తండ్రి లెగసీ.. ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణతోనే రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. జగన్ పార్టీ పేరే వైఎస్సార్ కాంగ్రెస్..  తన తండ్రి పేరుతోనే ఇది మొదలవుతుంది.  కావట్టి వైఎస్సార్ లెగసీకి తనను మాత్రమే ఏకైక అర్హుడిగా జగన్ భావిస్తున్నారు. సాధారణంగా పెళ్లి అయిన తర్వాత అమ్మాయి ఇంటి పేరు మారిపోతుంది. కొందరు పెళ్లైన తమ  ఇంటి పేరును మార్చుకోవడానికి ఇష్టపడరు. అది వేరే విషయం.  తాజాగా షర్మిళ రాకతో వైఎస్ పేరును ఆమె కూడా రాజకీయంగా వాడుకునే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన వైసీపీ, దాని అనుకూల మీడియాలో షర్మిళ ముందు ఎక్కడా కూడా వైఎస్ అనే ఇంటి పేరును జత చేయడం లేదు. షర్మిళ లేదా... ఆమె భర్త అనీల్ కుమార్ ఇంటి పేరును చేర్చి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.


అయితే ఇప్పటి వరకు షర్మిళ భర్త అనీల్ కుమార్ ఇంటి పేరు ఎవరికీ తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మరుక్షణమే ఆమె ఇంటి పేరు మోరుసుపల్లి షర్మిల అంటూ వైసీపీ నేతలు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటి దాకా వైఎస్ షర్మిళను, వైఎస్ జగన్ తో సమానంగా అభిమానించిన వైసీపీ సోషల్ మీడియా విభాగం ఇప్పుడు రూటు మార్చింది. షర్మిళను మోరుసుపల్లి షర్మిళగా ట్రోల్ చేయడం ప్రాంరభించారు. ఈ విధంగా అనీల్ కుమార్ ఇంటి పేరు వెలుగులోకి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: