ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే హాట్ సీట్ గా పేరున్న ఒక నియోజకవర్గం నెల్లూరు రూరల్.అధికార వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసిన  సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ అభ్యర్దిగా బరిలోకి దిగనున్నారు.గత రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి ప్రస్తుతం పార్టీ మరీ ఈసారికూడా గెలిచి చూపించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు.అయితే ఆయన దూకుడుకు బ్రేక్ వేయాలని బడా లీడర్ ను రేస్ లో నిలబెట్టింది అధికార వైసీపీ.ఇంతవకు ఓటమి అంటే ఎరుగని ఆదాల ప్రభాకర్ రెడ్డిను బరిలోకి దించింది అధికార వైసీపీ.

ఐతే కోటంను ఢీ కొట్టెందుకు ఆదాల వ్యూహం అక్కడ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి.ఎవరు నెల్లూరు రేసుగుర్రం అవుతారో ప్రజలు డిసైడ్ చేసే వేళ దగ్గరలోనే ఉంది.అయితే కోటంను కట్టడి చేయడానికి గతంలో ఆయన అనుచరులను దగ్గరకి తీసుకుంది అధికార పార్టీ వైసీపీ.అలాగే జిల్లాలో మాస్ ఫ్యాన్స్ ఉన్న న్యాయవాది మలిరెడ్డి కోటరెడ్డిని తనవైపు లాక్కుంది వైసీపీ.దాంతో శ్రీధర్ రెడ్డి పై పైచేయి సాధించారు ఆదాల ప్రభాకర్ రెడ్డి.దానికి తోడు రూలర్ నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న ఆనం విజయకుమార్ రెడ్డి కూడా ఆదాల కు ఫేవర్ గా ఉన్నారు.

అలాగే ఆయన నియోజక ఇంచార్జి పదవి ఇచ్చినప్పటినుండి 150కోట్లు రూపాయలు ఖర్చు చేసి అక్కడ అభివృద్ధిలో భాగంగా రోడ్లు, డ్రైనేజీ లాంటి పనులు చేపించాము అని అన్నారు. ఇంకా ముందు ముందు అభివృద్ధికి పాటుపడుతున్నారు అని అన్నారు .అక్కడి ప్రజలతో సానుకూలంగా దృక్పదాన్ని ఏర్పారచుకుంటున్నారు.ఆత్మీయ సభలు, సమావేశాలు పెడుతూ ప్రజలతో మరియు నేతలతో, నాయకులతో దూసుకుపోతున్నారు.తాను గెలిస్తే చేసే మంచి పనులు ముందుగానే చెప్పేసి హామీలు ఇస్తున్నారు.నేను గెలిచినా తర్వాత ఇక్కడ రౌడీయిజం, దోపిడీలు అలాంటి వాటిని సమూలంగా నిరోదిస్తాను అని అన్నారు.ప్రజలు తమ సంక్షేమ పధకాలు ఇంటింటింకి అందుతున్నాయని దాన్ని చూసి ప్రజలు వారి ఓటు ద్వారా చెప్తారని వచ్చేది వైసీపీ ప్రభుత్వం అని బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. గెలిచినా తర్వాత ఈ రూరల్ నియోజక వర్గ అభివృద్ధి ఉరకలు పెట్టిస్తానని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: