అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర రాజకీయం వాడి వేడిగా మారిపోయింది. అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే  లక్ష్యంగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. తన బలం సరిపోదు అని భావించి.. జనసేనతో పాటు బిజెపితో కూడా పొత్తు పెట్టుకుని జగన్ ను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు మాస్టర్ మైండ్ చంద్రబాబు. ఇక ఈ మూడు పార్టీలు కూటమీ సీట్ల సర్దుబాటు విషయంలో ఒప్పందం చేసుకొని బరిలోకి దిగుతున్నాయి అన్న విషయం తెలిసిందే.


 ఇక మరోవైపు సీఎం జగన్ అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు  ఇక ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు అన్న విషయం తెలిసిందే  కొన్నిచోట్ల కామన్ మ్యాన్స్ కి జగన్ టికెట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారిపోయింది. శివగమల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కకు పెట్టి మరి టిప్పర్ డ్రైవర్ కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే వైసిపి పార్టీలో సుదీర్ఘకాలం నుంచి కార్యకర్తగా పనిచేస్తున్న వీరాంజనేయులు కు టికెట్ ఇవ్వడం అటు ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.


  ఇక ఇలా టికెట్ కేటాయింపుతో తమది పేద ప్రజలకు పెద్దపీట వేసే ప్రభుత్వం అని జగన్ చెప్పకనే చెప్పారు. అయితే ఈ టికెట్ కేటాయింపు పై టిడిపి చేసిన కామెంట్ వైరల్ గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని టిప్పర్ డ్రైవర్ కు అసెంబ్లీ టికెట్ వైసీపీ ఇచ్చిందంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల నుంచి ఏ చిన్న తప్పు దొరికిన దాన్ని హైలైట్ చేయడం చూస్తూ ఉంటామ్. ఇక ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. పేదలంటే ఇంత చిన్నచూపా చంద్రబాబు? సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నిరుపేద సామాన్య కార్యకర్త వీరాంజనేయులు టికెట్ ఇచ్చారు. దీంతో ఓర్వలేక ఎగతాళి చేస్తూ.. నీ పెత్తందారి బుద్ధి చూపించావ్.. త్వరలోనే పేద ప్రజలు నీకు బుద్ధి చెప్పబోతున్నారు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చింది. అయితే ఇలాంటి కౌంటర్ ఇవ్వడం ద్వారా చంద్రబాబు పేదలను చిన్నచూపు చూస్తున్నారు అనే ఒక మెసేజ్ ని జనాల్లోకి పంపే ప్రయత్నం చేసింది వైసిపి.

మరింత సమాచారం తెలుసుకోండి: