ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలకు అన్ని పార్టీలు సైతం ఒక్కసారిగా స్పీడ్ పెంచేస్తున్నాయి. ఒకవైపు కూటమి పార్టీ జోరుగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. వైసీపీ పార్టీ మాత్రం ఈనెల 27 నుంచి  మేమంతా సిద్ధం అనే సభతో బస్సు యాత్రను మొదలుపెట్టారు.. అలా పలు నియోజవర్గాలలో సభలను నిర్వహిస్తూ.. తాము చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించేలా చేస్తున్నారు..ఇకపోతే సీఎం జగన్ బస్సు యాత్రలో భాగంగా నిన్నటి రోజున కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాలను పూర్తి చేశారు..ఇక తాజాగా ఇండియా హెరాల్డ్  తెలుపుతున్న సమాచారం మేరకు ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్ తమ పథకాలను తెలుపుతూ ప్రజలకు వివరిస్తూ తమ పార్టీకి మద్దతు పలకాలని తెలియజేశారు.


ముఖ్యంగా విపక్షాల నాయకులు వేసే జిత్తులను సైతం ఎదుర్కొనేందుకు ప్రజలను  కూడా సిద్ధంగా ఉండమని తెలియజేశారు. ముఖ్యంగా ఎమ్మిగనూరు సభా వేదిక పైన రెండు అంశాలకు  తెర లేపారు సీఎం జగన్.. శింగనమల వైసిపి అభ్యర్థి విషయంలో చంద్రబాబుకు కూడా అదిరిపోయే కౌంటర్ వేశారు.. చంద్రబాబు పాలన కారణంగా డిగ్రీలు చేసిన వ్యక్తులు టిప్పర్ డ్రైవర్లు,  ఉపాధి హామీ కూలీలుగా మారితే.. వారందరికీ వైసిపి పార్టీ  టికెట్లు ఇచ్చి అక్కున చేర్చుకుంది అంటూ తెలియజేశారు.



ఇండియా హెరాల్డ్ కు అందిన సమాచారం మేరకు..  ఈ రోజున కర్నూలు జిల్లా రాతన  నుంచి బస్సు యాత్ర మొదలై అనంతపూర్ జిల్లా వరకు జరగనుంది.. ముఖ్యంగా రాతన నుంచి తుగ్గలి చేరుకొని ప్రజలతో మమేకమై అక్కడ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆ తర్వాత గరికట్ల క్రాస్ మీదుగా జొన్నగిరి, గుత్తి , పామిడి, గార్లదిన్నె, రాప్తాడు, ఇటుకలపల్లి , కృష్ణం రెడ్డిపల్లి కి చేరుకొని అక్కడే రాత్రి బస చేయబోతున్నారు జగన్.. సాయంత్రం మూడు గంటల  సమయంలో అనంతపూర్ బైపాస్ నుంచి రాప్తాడు బైపాస్ కి బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు..

అయితే ఇప్పటివరకు కొన్ని నియోజకవర్గాలలో వైసిపి అభ్యర్థులను మార్చడంతో అటు వైసిపి కార్యకర్తలు కూడా కొంతమేరకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు... కొంతమంది అభ్యర్థులను మార్చాలంటూ పట్టుపడుతున్నా.. ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఈరోజు బస్సు యాత్రతో మళ్ళీ అలాంటిది జరగకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళ్లబోతున్నారు.. మరోవైపు  ఇటీవలే అనంతపురం జిల్లాలో గుంతకల్లు - అనంతపురం రూరల్ లో టిడిపి అభ్యర్థులను మార్చడంతో అక్కడ కూడా కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు టిడిపి నాయకులు,  కార్యకర్తలు.. దీంతో కొంతమేరకు మళ్ళీ వైసీపీ పార్టీకి బాగా కలిసి వచ్చింది.. ప్రస్తుతం సీఎం జగన్ అనంతపురం లో పర్యటించి ఇక్కడి ప్రజల మద్దతు పొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు.. అంతేకాదు ఈ ప్రాంతాల అభ్యర్థులను ప్రజల మధ్య హైలెట్ చేస్తూ.. సభా ప్రసంగాలను కొనసాగించ బోతున్నారు. దీంతో అనంతపురం లో వైసిపి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ యాత్ర మొదలుపెట్టారు. మొత్తానికైతే అనంతపురంలో ఈ సభ ఏర్పాటు చేయడం వల్ల వైసీపీ పార్టీకి మరింత బలం చేకూరనున్నట్లు వైసిపి కార్యకర్తలు,  నాయకులు భావిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: